తెలంగాణలో 172 ప్రభుత్వ ఉద్యోగాలు.. నెలకు రూ.28,719 జీతం.. దరఖాస్తులకు రేపే ఆఖరు తేది
TS 172 JPS Posts: ఈ నోటిఫికేషన్ ద్వారా స్పోర్ట్స్ కోటాలో 172 జూనియర్ పంచాయతీ సెక్రటరీ పోస్టులను భర్తీ చేయనుంది. ఈ పోస్టులకు సంబంధించి సెప్టెంబర్ 18 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది.

ప్రధానాంశాలు:
టీఎస్ పంచాయతీ రాజ్ శాఖ రిక్రూట్‌మెంట్
172 జూనియర్ పంచాయతీ సెక్రటరీ పోస్టులు
అక్టోబర్ 10 దరఖాస్తులకు చివరి తేదీ
తెలంగాణలోని నిరుద్యోగులకు గుడ్‌న్యూస్. టీఎస్ పంచాయతీరాజ్ శాఖ పలు ఖాళీల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా స్పోర్ట్స్ కోటాలో 172 జూనియర్ పంచాయతీ సెక్రటరీ పోస్టులను భర్తీ చేయనుంది. ఈ పోస్టులకు సంబంధించి సెప్టెంబర్ 18 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది.
అక్టోబర్ 10 దరఖాస్తులకు చివరి తేదీ. ఇవి స్పోర్ట్స్ కోటాలో భర్తీ చేస్తున్న పోస్టులు కాబట్టి విద్యార్హతలతో పాటు పలు క్రీడల్లో రాణించి ఉండాలి. ఈ పోస్టులకు సంబంధించిన పూర్తివివరాలను http://www.tsprrecruitment.in/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు.
మొత్తం ఖాళీలు: 172
ఆదిలాబాద్- 6
భద్రాద్రి కొత్తగూడెం- 7
జగిత్యాల- 5
జనగాం- 4
జయశంకర్ భూపాలపల్లి, ములుగు- 6
జోగుళాంబ గద్వాల్- 3
కామారెడ్డి- 8
కరీంనగర్- 4
ఖమ్మం- 9
కొమరంభీమ్ ఆసిఫాబాద్- 4
మహబూబాబాద్- 7
మహబూబ్‌నగర్, నారాయణపేట- 10
మంచిర్యాల- 4