top of page

UPSC Recruitment 2022: యూపీఎస్సీలో 247 ఇంజ‌నీరింగ్ ఉద్యోగాలు.. ద‌ర‌ఖాస్తు వివ‌రాలు

UPSC Recruitment 2022 : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్-UPSC ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామ్ 2022 నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ పోస్టులకు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి అక్టోబ‌ర్ 20, 2021 వ‌ర‌కు అవ‌కాశం ఉంది.



యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్-UPSC ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామ్ 2022 నోటిఫికేషన్ విడుదల అయ్యింది. యూపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ upsconline.nic.in ఓపెన్ చేసి వివరాలు చూడొచ్చు. UPSC ESE 2022 ఎగ్జామ్‌కు దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 22, 2021 నుంచి ప్రారంభమవుతుంది. దరఖాస్తు చేసుకోవడానికి అక్టోబర్ 12, 2021 వరకు అవకాశం ఉంది. దరఖాస్తు చేసే అభ్యర్థులు ముందుగా పార్ట్-1, పార్ట్-2 అప్లికేషన్ పూర్తి చేయడం మర్చిపోవద్దు. ఫిబ్రవరి 20 2022న యూపీఎస్సీ ఈఎస్ఈ ఎగ్జామ్ నిర్వహించనుంది. దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్ లైన్ ద్వారా ఉంటుంది. దరఖాస్తు చేసుకోవాలనుకొన్న అభ్యర్థులు రూ.200 పరీక్ష ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, మహిళలకు పరీక్ష ఫీజు లేదు.


ముఖ్యమైన సమాచారం

మొత్తం పోస్టులు

247

వయోపరిమితి

21 ఏళ్ల నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి

పరీక్ష కేంద్రాలు

హైదరాబాద్, తిరుపతి, విశాఖపట్నం

డిపార్ట్ మెంట్లు

సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్

ఎంపిక విధానం..

- పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు.