Aadhaar Bank Account Link: మీ ఆధార్ నెంబర్ ఏ బ్యాంక్ అకౌంట్‌కు లింక్ అయిందో తెలుసా? ఇలా తెలుసుకోండి
Aadhaar Bank Account Link Status | మీ ఆధార్ నెంబర్ ఏ బ్యాంక్ అకౌంట్‌కు లింక్ అయిందో తెలుసుకోలేకపోతున్నారా? చాలా సింపుల్‌గా తెలుసుకోవచ్చు. ఈ స్టెప్స్ ఫాలో అవండి.

ప్రస్తుత పరిస్థితుల్లో ఆధార్ కార్డు అనేక చోట్ల అవసరం అవుతోంది. ముఖ్యంగా ప్రభుత్వ పథకాలు పొందడానికి ఆధార్ కార్డు (Aadhaar Card) తప్పనిసరి. రేషన్ షాపులో సరుకులు తీసుకోవాలన్నా ఆధార్ నెంబర్ కావాల్సిందే. ఇక ప్రభుత్వ పథకాలకు సంబంధించిన డబ్బులు ఆధార్ నెంబర్‌కు లింక్ అయిన అకౌంట్లలో జమ అవుతుంటాయి. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధితో (PM-Kisan) పాటు రాష్ట్ర ప్రభుత్వాలు అందించే పథకాలకు చెందిన నిధులు ఆధార్ నెంబర్‌కు లింకైన బ్యాంక్ అకౌంట్లలో (Bank Account) జమ చేస్తుంటారు అధికారులు. కాబట్టి బ్యాంక్ అకౌంట్‌కు ఆధార్ నెంబర్ లింక్ చేయడం తప్పనిసరిగా మారిపోయింది. అయితే రెండుమూడు బ్యాంకుల్లో అకౌంట్లు మెయింటైన్ చేస్తున్నవాళ్లు తమ ఆధార్ నెంబర్ ఏ బ్యాంక్ అకౌంట్‌కు లింక్ అయిందో తెలియక ఇబ్బంది పడుతుంటారు.
యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా-UIDAI ఈ సేవల్ని అందిస్తోంది. యూఐడీఏఐ అధికారిక వెబ్‌సైట్ https://uidai.gov.in/ లో మీరు మీ ఆధార్ నెంబర్‌ను ఏ బ్యాంక్ అకౌంట్‌కు లింక్ చేశారో తెలుసుకోవచ్చు. అయితే ముందుగా మీ ఆధార్ నెంబర్‌కు మొబైల్ నెంబర్ లింక్ అయి ఉంటేనే ఈ వివరాలు తెలుస్తాయి. ఒకవేళ మీ ఆధార్ నెంబర్‌కు మొబైల్ నెంబర్ లింక్ లేకపోతే ఎలా లింక్ చేయాలో తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి. అసలు ఏ మొబైల్ నెంబర్ ఆధార్ నెంబర్‌కు లింక్ అయిందో తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
ముందుగా యూఐడీఏఐ అధికారిక వెబ్‌సైట్ https://uidai.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయండి.
హోమ్ పేజీలో Aadhaar Services పైన క్లిక్ చేయండి.
Check Aadhaar Bank Linking Status లింక్ పైన క్లిక్ చేయండి.
కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
ఆధార్ నెంబర్ లేదా వర్చువల్ ఐడీ ఎంటర్ చేయండి.
సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేయండి.
ఆ తర్వాత Send OTP పైన క్లిక్ చేయండి.
మీ ఆధార్ నెంబర్‌తో లింక్ అయిన మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది.
ఓటీపీ ఎంటర్ చేసి Submit పైన క్లిక్ చేయాలి.