top of page

ATM New Rule: ఏటీఎంలో డబ్బులు లేవా? రూ.10,000 ఫైన్ చెల్లించనున్న బ్యాంకులు



ATM New Rule | ఏటీఎంలో కస్టమర్లకు నో క్యాష్ బోర్డులు కనిపించడం మామూలే. ఒక ఏటీఎంలో డబ్బులు లేకపోతే మరో ఏటీఎం చుట్టూ తిరుగుతుండటం కస్టమర్లకు అలవాటే. ఇకపై ఏటీఎంలో డబ్బులు లేకపోతే బ్యాంకులు రూ.10,000 ఫైన్ చెల్లించక తప్పదు.

1. మీరు ఏదైనా ఏటీఎంకు వెళ్తే అక్కడ నో క్యాష్ బోర్డ్ కనిపించిందా? కార్డ్ స్వైప్ చేస్తే ఏటీఎంలో డబ్బులు లేవని మెసేజ్ వచ్చిందా? ఇకపై ఈ పరిస్థితి ఉండకపోవచ్చు. ఏటీఎంలో డబ్బుల విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI కొత్త రూల్స్ అమలు చేయనుంది. (ప్రతీకాత్మక చిత్రం)


2. కొన్ని ఏటీఎంలల్లో అయితే ఒకట్రెండు రోజులపాటు డబ్బులు ఉండవు. ఇలాంటి అనుభవాలు కస్టమర్లకు మామూలే. ఇంటి దగ్గర్లోనే ఏటీఎం ఉంది కదా అని వెళ్తే, తీరా అక్కడికి వెళ్లాక డబ్బులు ఉండక ఇబ్బందులు పడుతుంటారు కస్టమర్లు. (ప్రతీకాత్మక చిత్రం)


3. ఇకపై ఏటీఎంలల్లో ఈ పరిస్థితి ఉండకపోవచ్చు. అక్టోబర్ నుంచి ఏటీఎంల విషయంలో కొత్త రూల్స్ అమల్లోకి వస్తాయి. బ్యాంకులు ఏటీఎంల ద్వారా కస్టమర్లకు డబ్బులు అందించడంలో విఫలమైతే ఫైన్ చెల్లించాల్సి ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)


4. ఏటీఎంలో డబ్బులు ఉండకపోతే కస్టమర్లకు ఇబ్బందులు రావడం సహజమే. అందుకే ఏటీఎంలో నిత్యం నగదు అందుబాటులో ఉంచేందుకు ఆర్‌బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం 'స్కీమ్ ఆఫ్ పెనాల్టీ ఫర్ నాన్-పిప్లెనిష్‌మెంట్ ఆఫ్ ఏటీఎంస్' రూపొందించింది. (ప్రతీకాత్మక చిత్రం)


5. ఈ కొత్త రూల్స్ ప్రకారం బ్యాంకులు తప్పనిసరిగా అన్ని ఏటీఎంలల్లో నగదు మెయింటైన్ చేయాలి. ఇందుకోసం బ్యాంకులు, వైట్ లేబుల్ ఏటీఎం ఆపరేటర్లు తమ వ్యవస్థల్న పటిష్టం చేయాలి. ఏటీఎంలల్లో నగదు ఎంత అందుబాటులో ఉందో బ్యాంకులు ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఉండాలి. (ప్రతీకాత్మక చిత్రం)