రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన ఆటోవాలా, ఎలా?కేరళలో ఒక ఆటోవాలా రాత్రికి రాత్రే కోటీశ్వరుడిగా మారాడు. జైపాలన్‌కు లాటరీలో 12 కోట్ల రూపాయల నగదు బహుమతి వచ్చింది. కేరళలో ఓనం పండుగ సందర్భంగా నిర్వహించిన తిరుఓనమ్ బంపర్ లాటరీలో జయపాల్ ఈ టిక్కెట్టును కొన్నాడు. పన్నులు మొత్తాన్ని తీసేసిన తరువాత మొత్తం డబ్బును జైపాలన్ ఖాతాలో ఏడు కోట్ల 56 లక్షల రూపాయలను వేయనున్నారు.

జైపాలన్‌కు ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు. ముందు నుంచి లాటరీ కొనడం అలవాటుగా పెట్టుకున్నాడు జైపాలన్. ఏదో ఒక సమయంలో ఎంతో కొంత తగులుతుంది. తమ సమస్యలు తీరిపోతాయి. హాయిగా బతకవచ్చని భావించాడు జైపాలన్.

అందుకే పట్టువదలని విక్రమార్కుడిలా తాను లాటరీని కొంటున్నట్లు చెప్పుకొచ్చాడు. అయితే ఉన్నట్లుండి 12 కోట్ల రూపాయల లాటరీ తగలడంతో జైపాలన్ ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. వచ్చిన డబ్బుతో జీవితాంతం ప్రశాంతంగా ఉంటానంటున్నాడు జైపాలన్.

3 views0 comments