top of page

నేలపై కూర్చొని తినడం వల్ల రక్తపోటును నియంత్రించడం సాధ్యమేనా?

కాలంతో పాటు మనుషులు కూడా మారిపోతున్నారు. పూర్వం మన ఇళ్లలో డైనింగ్ టేబుల్స్ ఉండేవి కావు. దాంతో అందరూ నేలపై కూర్చుని తినేవారు. అందుకే అప్పట్లో మనిషి ఎక్కువ కాలం జీవించేవాడు. కానీ ప్రస్తుత కాలంలో ఏం తినాలన్నా టేబుల్ మీద పెట్టుకుని తినడానికి అలవాటు పడిపోయాం.

ప్రధానాంశాలు:

  • ఆహరం తినే అలవాట్ల కారణంగా ఆరోగ్యం

  • నేలపై కూర్చుని తినడం వల్ల బోలెడు లాభాలు

ఇప్పుడు భోజనం చేయాలన్నా, టిఫిన్ చేయాలన్నా, ఏం తినాలన్నా, తాగాలన్నా.. అన్నింటికీ కుర్చీలు, టేబుల్స్‌కు బాగా అలవాటు పడిపోయాం. ఏ మాత్రం నడుము వంచకుండా అన్ని పనులు పూర్తి చేసుకుంటున్నాం. కుర్చీల్లో కూర్చునేవారికి నడుం చుట్టూ రింగులాగా కొవ్వు పేరుకొని... ఆ తర్వాత పొట్ట పెరుగుతుంది. ఆ తర్వాత అధిక బరువు పెరుగుతారు. ఆ తర్వాత బీపీ, షుగర్, హార్ట్ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది. ఇదంతా లేకుండా... నేలపై కూర్చుంటే పొట్ట వచ్చే అవకాశాలు తక్కువ అని నిపుణులు చెప్తున్నారు.

మన పూర్వీకులు మనకు నేర్పిన అలవాట్లు, పద్ధతులు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుస్తాయి. కానీ మనం వాటిని చాలా నిర్లక్ష్యం చేస్తున్నాం. దీంతో ప్రస్తుతం నేలపై కూర్చుని భోజనం చేసే వారి సంఖ్య బాగా తగ్గిపోయింది. కానీ నేలపై కూర్చుని ఆహారం తింటే ఎన్నో లాభాలు కలుగుతాయని వైద్యులు చెప్తున్నారు. యూరిపియన్ జర్నల్ ఆఫ్ ప్రివెంటివ్ కార్డియాలలో ప్రచురితమైన ఓ కథనం ప్రకారం... నేలపై కూర్చుని భోజనం చేయడం వల్ల ఆయుష్షు పెరుగుతుందని పరిశోధకులు వెల్లడించారు. డైనింగ్ టేబుల్ మీద కూర్చుని తినడం చాలా అనుకూలంగా ఉంటుంది. కానీ ఇది ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాన్ని అందివ్వదు. మనం నేలపై కూర్చుని తినాలని మన పెద్దవాళ్లు చెప్పిన పద్ధతి వెనక చాలా ప్రయోజనాలున్నాయి. కూర్చునే పద్ధతి కూడా రెండు కాళ్లు క్రాస్‌గా మడతపెట్టి కూర్చుని తినాలి. ఇలా తినడం వల్ల పొందే ఆరోగ్య ప్రయోజనాలు మీరు విస్తుపోయేలా చేస్తాయి.


నేలపై కూర్చుని భోజనం చేయడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. జీర్ణ వ్యవస్థకు సహకారం లభిస్తుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం అవుతుంది. తినడానికి నేలపై కూర్చునప్పుడు ఖచ్చితంగా మీరు కాళ్లు మడతపెట్టి కూర్చుంటారు. అంటే దాన్నే సుఖాసన లేదా హాఫ్ పద్మాసన అని పిలుస్తారు. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇలా ఆహారం ముందు కూర్చోవడం వల్ల జీర్ణక్రియకు సిద్ధంగా ఉండాలని మెదడుకి సంకేతాలు అందుతాయి.


ప్లేట్ నేలపై ఉండటం వల్ల ఆటోమేటిక్‌గా మీ శరీరం కిందకు వంగుతుంది. ఆహారం తీసుకున్న తర్వాత మళ్లీ వెనక్కి కూర్చున్న పొజిషన్‌కు వస్తుంది. ఇలా వెనక్కి, ముందుకి వెళ్లడం వల్ల పొట్టలో ఉండే కండరాలు యాక్టివేట్ అవుతాయి. దీనివల్ల ఆహారం త్వరగా, సులువుగా జీర్ణమవుతుంద