Gmail Password: మీ జీమెయిల్ పాస్‌వర్డ్ మార్చారా? వెంటనే మార్చండి ఇలా

Gmail Password | జీమెయిల్ యూజర్లకు అలర్ట్. మీ జీమెయిల్ పాస్‌వర్డ్ (Gmail Password) మార్చి ఎన్ని రోజులైంది? తరచూ జీమెయిల్ పాస్‌వర్డ్ మార్చడం మంచిది. జీమెయిల్ పాస్‌వర్డ్ మారిస్తే చాలు... గూగుల్ అకౌంట్‌లోని ప్లాట్‌ఫామ్స్ అన్నింటికీ అదే పాస్‌వర్డ్ ఉపయోగించుకోవచ్చు. మరి జీమెయిల్ పాస్‌వర్డ్ సింపుల్‌గా ఎలా మార్చాలో తెలుసుకోండి.

1. ఆన్‌లైన్‌లో ఏ అకౌంట్ ఓపెన్ చేసినా పాస్‌వర్డ్ తప్పనిసరి. అందరికీ జీమెయిల్ అకౌంట్ తప్పనిసరిగా ఉంటుంది. జీమెయిల్ అకౌంట్ పాస్‌వర్డ్ ఎప్పటికప్పుడు మార్చడం తప్పనిసరి. ప్రతీ ఆరు నెలలకు ఓసారి లేదా పాస్‌వర్డ్ ఇతరులకు తెలిసిందన్న అనుమానం వచ్చిన ప్రతీసారి జీమెయిల్ పాస్‌వర్డ్ మార్చాలి.


2. ఎప్పటికప్పుడు జీమెయిల్ పాస్‌వర్డ్ మారిస్తే సైబర్ దాడుల్ని, హ్యాకింగ్‌లను అడ్డుకోవచ్చు. చాలావరకు ఇతర అకౌంట్స్‌లలో జీమెయిల్ ద్వారా లాగిన్ అవుతుంటారు. కాబట్టి జీమెయిల్ పాస్‌వర్డ్ లీక్ అయిందంటే మిగతా అకౌంట్లకూ ముప్పే. అందుకే జీమెయిల్ పాస్‌వర్డ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.


3. పొరపాటున కూడా పాస్‌వర్డ్ ఇతరులకు చెప్పొద్దు. తరచూ పాస్‌వర్డ్స్ మారుస్తూ ఉండాలి. మీ జీమెయిల్ పాస్‌వర్డ్ మార్చడానికి ముందుగా http://myaccount.google.com వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి. లేదా జీమెయిల్ అకౌంట్ లాగిన్ కావాలి. అకౌంట్ ఐకాన్ పైన క్లిక్ చేసి Manage Your Google Account పైన క్లిక్ చేయాలి.


4. ఆ తర్వాత ఎడమ వైపు Security పైన క్లిక్ చేయాలి. Signing in to Google ఆప్షన్ క్లిక్ చేయాలి. మీరు చివరిసారిగా పాస్‌వర్డ్ ఎప్పుడు మార్చారో అక్కడ ఉంటుంది.

పాస్‌వర్డ్ చేసే ఆప్షన్ క్లిక్ చేయాలి. మరోసారి మీ వివరాలతో లాగిన్ కావాలి.


5. మీ కొత్త పాస్‌వర్డ్ ఎంటర్ చేయాలి. మీ కొత్త పాస్‌వర్డ్‌ని మరోసారి ఎంటర్ చేయాలి. ఆ తర్వాత Change Password పైన క్లిక్ చేస్తే చాలు. పాస్‌వర్డ్ మారిపోతుంది. మీ పాస్‌వర్డ్ విజయవంతంగా మారిందో లేదో తెలుసుకోవడానికి ఓసారి లాగౌట్ అయి మళ్లీ లాగిన్ కావాలి.


6. మీ పేరు, మొబైల్ నెంబర్, పుట్టిన తేదీ లాంటి వివరాలను పాస్‌వర్డ్‌గా పెట్టకూడదు. 11111111, 22222222... ఇలాంటి సులువైన పాస్‌వర్డ్స్ కూడా పెట్టొద్దు. గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ఉంటుందని ఇంత సింపుల్ పాస్‌వర్డ్స్ పెట్టడం చాలామందికి అలవాటు. ఇంత ఈజీ పాస్‌వర్డ్స్ పెడితే మీ అకౌంట్ హ్యాక్ చేయడం పెద్ద కష్టమేమీ కాదు.


7. ఇలాంటి పాస్‌వర్డ్స్‌ని హ్యాకర్లు సులువుగా తెలుసుకోగలరు. స్ట్రాంగ్ పాస్‌వర్డ్ ఉండాలి. కనీసం 8 క్యారెక్టర్లు పాస్‌వర్డ్ ఉండాలని గూగుల్ సూచిస్తుంది. కానీ 12 క్యారెక్టర్లతో పాస్‌వర్డ్ క్రియేట్ చేయడం మంచిది. లెటర్స్, నెంబర్స్, స్పెషల్ క్యారెక్టర్స్ కలిపి 12 క్యారెక్టర్ల పాస్‌వర్డ్ క్రియేట్ చేయాలి.

1 view0 comments