India Corona Updates: భారత్‌లో మళ్లీ పెరిగిన కరోనా కేసులు... మరణాలు భారీగా పెరిగాయా?
India Corona updates: భారత్‌లో మళ్లీ కరోనా కేసులు పెరిగాయి. ఇక మరణాల సంఖ్య కూడా అమాంతం పెరిగింది. నిన్న ఒక్కరోజే 666 మరణాలు నమోదయ్యాయి. మరి వీరంతా నిన్న ఒక్క రోజే మరణించారా? పూర్తి వివరాలు ఇవాళ్టి కరోనా మీడియా బులెటిన్‌లో తెలుసుకుందాం.

India Corona cases: భారత్‌లో గడిచిన 24 గంటల్లో 16,326 కరోనా కేసులు నమోదయ్యాయి. 17,677 మంది కోవిడ్ మహమ్మారి నుంచి సంపూర్ణంగా కోలుకున్నారు. నిన్న దేశవ్యాప్తంగా 666 మరణాలు నమోదయ్యాయి.
తాజా కేసులతో కలిపి దేశంలో నమోదైన మొత్త కరోనా కేసుల సంఖ్య 3,41,59,562కి చేరింది. వీరిలో ఇప్పటి వరకు 3,35,32,126 మంది కోలుకున్నారు. కరోనా బారినపడి 4,53,708 మంది మరణించారు. ప్రస్తుతం ఇండియాలో 1,73,728 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.
నిన్న 666 మరణాలు నమోదవడంతో ఆందోళన నెలకొంది.ఐతే వీరంతా నిన్న ఒక్కరోజే మరణించిన వారు కాదు. కేరళలో గతంలో నమోదైన మరణాలను నిన్న సవరించడంతో... మొత్తం 563 మరణాలు అదనంగా చేరాయి. ఈ క్రమంలోనే మొత్త మరణాల సంఖ్య పెరిగినట్లుగా కనిపిస్తోంది.
కేరళలో కొత్త కేసులు మళ్లీ పెరిగాయి. నిన్న 9,361 కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం కేరళలో 81,490 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.
భారత్‌లో నిన్న 13,64,681 మందికి కరోనా పరీక్షలు చేశారు. ఇప్పటి వరకు 59.84 లక్షల మందికి కరోనా టెస్ట్‌లు నిర్వహించారు. ఇక నిన్న దేశవ్యాప్తంగా 68,48,417 మందికి కరోనా టీకాలు వేశారు. ఇప్పటివరకు 101 కోట్ల 30 లక్షలకు పైగా డోస్‌ల వ్యాక్సిన్ వేశారు.

రాష్ట్రాల వారీగా కరోనా కేసుల వివరాలు