Covid: ఇండియాలో భారీగా తగ్గిన కరోనా కేసులు... లేటెస్ట్ అప్‌డేట్స్

గత 5 రోజులుగా ఇండియాలో కరోనా కొత్త కేసులు తగ్గుతున్నాయి. ఇదో మంచి పరిణామం. ఈ నెలలో థర్డ్ వేవ్ వస్తుంది అని నిపుణులు చెప్పిన సమయంలో... ఇలా తక్కువ కేసులు రావడం మంచిదే.
India Covid: ఇండియాలో కొత్తగా 25,166 పాజిటివ్ కేసులు వచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 3,22,50,679కి చేరింది. దేశంలో కరోనాతో కొత్తగా 437 మంది చనిపోయారు. మొత్తం మరణాల సంఖ్య 4,32,079కి చేరింది. మరణాల రేటు 1.3 శాతంగా ఉంది. ప్రపంచ దేశాల్లో ఇది 2.10 శాతంగా ఉంది.
ఇండియాలో కొత్తగా 36,830 మంది రికవరీ అయ్యారు. మొత్తం రికవరీల సంఖ్య 3,14,48,754కి చేరింది. రికవరీ రేటు 97.5 శాతంగా ఉంది. ప్రస్తుతం భారత్‌లో 3,69,846 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
దేశవ్యాప్తంగా కొత్తగా 15,63,985 టెస్టులు చేశారు. భారత్‌లో ఇప్పటివరకు 49 కోట్ల 66 లక్షల 29 వేల 524 టెస్టులు చేశారు. కొత్తగా 88,13,919 మందికి వ్యాక్సిన్లు వేశారు. ఇప్పటివరకు 55 కోట్ల 47 లక్షల 30వేల 609 వ్యాక్సిన్లు వేశారు.
గత 24 గంటల్లో యాక్టివ్ కేసులు ఏకంగా 12,101 తగ్గాయి. కొత్త కేసుల కంటే రికవరీలు ఎక్కువగా ఉండటం వల్ల ఇది సాధ్యమైంది. నిన్న దేశంలోనే అత్యధికంగా కేరళలో 12,294 కొత్త కేసులు రాగా ఆ తర్వాత మహారాష్ట్రలో 4,145, తమిళనాడులో 1851, కర్ణాటకలో 1,065 కొత్త కేసులు వచ్చాయి. నిన్న దేశంలోనే అత్యధికంగా కేరళలో 142 మంది చనిపోగా... ఆ తర్వాత మహారాష్ట్రలో 100 మంది, ఒడిశాలో 66 మంది కరోనాతో చనిపోయారు.

AP Covid: ఏపీలో కొత్తగా 45,962 టెస్టులు చెయ్యగా... కొత్తగా 909 పాజిటివ్ కేసులొచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 19,94,606కి చేరింది. కొత్తగా 13 మంది చనిపోయారు. మొత్తం మరణాల సంఖ్య 13,660కి చేరింది. కొత్తగా 1,543 మంది కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 19,63,728కి చేరింది. ప్రస్తుతం 17,218 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 2,57,08,411 టెస్టులు జరిగాయి. (image credit - twitter)