top of page

Diesel Door Delivery: ఒక్క ఫోన్ కాల్ చేస్తే... ఇంటికే డీజిల్ డెలివరీ

Updated: Aug 24, 2021



పెట్రోల్ బంకుకు వెళ్లి డీజిల్ కొనే టైమ్ లేదా? ఒక్క ఫోన్ కాల్ చేస్తే డీజిల్ ఇంటికే వచ్చేస్తుంది. డీజిల్ డోర్ డెలివరీ సేవల్ని ప్రారంభించింది బీపీసీఎల్. పూర్తి వివరాలు తెలుసుకోండి.

ఇంధన ధరలు నిరంతరాయంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో పెట్రోల్‌తో పాటు డీజిల్ ధర కూడా లీటర్ రూ.100 దాటింది. అయినప్పటికీ వినియోగం ఎక్కువ కావడంతో డిమాండ్ బాగా పెరిగింది. ఈ గిరాకీని దృష్టిలో పెట్టుకొని ఇంధన డోర్ డెలివరీ సేవలను ప్రారంభించింది భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్.


కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేసే ఈ ఇంధన సంస్థ డీజిల్‌ను వినియోగదారుల ముందుకు తీసుకురానుంది. ఇందుకోసం తూర్పు ప్రాంతంలోని (ఈస్టర్న్ రీజియన్‌) వివిధ ప్రదేశాల్లో 15 మొబైల్ బౌసర్లు, 9 జెర్రీ క్యాన్ సదుపాయాలను ఏర్పాటు చేసింది.


అత్యాధునిక మొబైల్ డిస్పెన్సర్ల ద్వారా డోర్ స్టెప్ డీజిల్ డెలివరీ సేవలను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు బీపీసీఎల్ రిటైల్ ఇంఛార్జ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పీఎస్ రవి. లేటెస్ట్ ఎలక్ట్రానిక్ డిస్పెన్సింగ్, జియోఫెన్సింగ్ టెక్నాలజీ ద్వారా అందిస్తున్న ఫ్యూయెల్ కార్ట్ డోర్ స్టెప్ డెలివరీ సేవలు వినియోగదారులను ఆకట్టుకుంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు.


గత రెండేళ్లుగా మొబైల్ డిస్పెన్సర్ల ద్వారా డోర్ టూ డోర్ డెలివరీ మెరుగైన ఫలితాలను ఇచ్చిందని బీపీసీఎల్ తెలిపింది. ఇందుకు ఇప్పటి వరకు 1588 ఫ్యూయెల్‌కార్ట్స్‌ (FuelKarts), 129 ఫ్యూయలెంట్స్ (FuelEnts) ప్రారంభించినట్లు కంపెనీ పేర్కొంది.



ఈ ఫ్యూయెల్ కార్ట్స్ వ్యవస్థ.. సకాలంలో డెలివరీ, నాణ్యత, పరిమాణానికి పూర్తి భరోసా, సురక్షితమైన ఉత్పత్తి నిర్వహణ లాంటి ఇతర ప్రయోజనాలను అందిస్తూ వ్యాపారాన్ని సులభతరం చేయడానికి సహాయపడుతుందని స్పష్టం చేసింది.


కంపెనీ ఇప్పటికే పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్, ఒడిశా, ఈశాన్య రాష్ట్రాల్లో అవసరమైనవారికి సేవలందించేందుకు 63 మొబైల్ డిస్పెన్లర్లను ప్రారంభించింది. దీంతోపాటు తూర్పు ప్రాంతంలోని న