Anemia: మటన్ లివర్‌తో రక్తహీనతకు చెక్ పెట్టొచ్చా.. రక్తం పెరగాలంటే ఎలాంటి ఆహారం బెటర్?
Anemia సమస్య ఉన్నవారిలో శ్వాస(breath) తీసుకోవటంలో ఇబ్బంది, పాలిపోయిన చర్మం, అలసట, బలహీనత వంటి లక్షణాలు కలిగి ఉంటారు. మన శరీరం అంతా కూడా వివిధ ధాతువుల యొక్క సమ్మేళనం. అయితే రక్తహీనత ఎక్కువగా ఉన్న వారు మంచి ఆహారం తీసుకుంటే రక్తం(blood) మోతాదు పెరుగుతుందట. అందులో ఎక్కువగా మటన్ లివర్(mutton liver), రొయ్యలు (prance) లాంటివి తీసుకుంటే రక్తహీనతకు చెక్ పెట్టొచ్చంట.

రక్త హీనత(Anemia) మనిషి శరీరంలో హిమోగ్లోబిన్(Hemoglobin) లోపించడం వలన వస్తుంది. అలాంటి వారు తలనొప్పి రావడం, తొందరగా అలసిపోవడం ఇలా ఏదో ఒక లక్షణంతో నిత్యం బాధపడుతుంటారు. ఇలాంటి వారికి చికిత్స చాలా అవసరం. అజాగ్రత్త చేయవద్దు. మామూలుగా ఈ రక్త హీనత సమస్య అనేక రకాలుగా ఉంటుంది. అందులో ముఖ్యంగా ఇనుము లోపించటం వలన వచ్చే రక్త హీనత, మెగాలోబ్లాస్టిక్ రక్తహీనత, అప్లాస్టిక్ Anemia వంటి అనేక రకాలుగా ఉంటుంది. ఈ Anemia సమస్య ఉన్నవారిలో శ్వాస(breath) తీసుకోవటంలో ఇబ్బంది, పాలిపోయిన చర్మం, అలసట, బలహీనత వంటి లక్షణాలు కలిగి ఉంటారు. మన శరీరం అంతా కూడా వివిధ ధాతువుల యొక్క సమ్మేళనం. అయితే రక్తహీనత ఎక్కువగా ఉన్న వారు మంచి ఆహారం తీసుకుంటే రక్తం(blood) మోతాదు పెరుగుతుందట. అందులో ఎక్కువగా మటన్ లివర్(mutton liver), రొయ్యలు (prance) లాంటివి తీసుకుంటే రక్తహీనతకు చెక్ పెట్టొచ్చంట.
తలనొప్పి, చికాకు, త్వరగా అలసిపోవడం లాంటి సమస్యలు రెగ్యులర్(regular)గా వస్తే రక్తహీనతకు సూచికగా భావించాలి. శరీరంలో సరిపడ రక్తం లేకుంటే ఇలాంటి సమస్యలెన్నో చుట్టుముడుతుంటాయి. శరీరంలో తగినన్ని ఎర్ర రక్త కణాలు(RBC) లేకపోతే రక్తం తయారు కాదు.. దీనివల్ల శరీర భాగాలకు ఆక్సిజన్ సరిగ్గా అందదు. పలు సర్వేలు పిల్లలు, మహిళలు రక్త హీనత సమస్యతో బాధపడుతున్నట్లు తేలింది. రక్తహీనతకు మనం తీసుకునే ఆహారం(food)లో సరైన పోషకాలు లేకపోవడమే కారణమే. శరీరంలో ఐరన్(Iron) మోతాదును పెంచుకోవాలి. మాంసాహారం(Non veg) అలవాటు ఉంటే మటన్ లివర్, మటన్‌ను తీసుకుంటే శరీరానికి అవసరమైన ఐరన్‌ను పొందొచ్చు. లివర్‌లో ఐరన్, ఫోలేట్ ఎక్కువగా ఉంటాయి. దీంతో శరీరానికి అవసరమైన ఐరన్ పుష్కలంగా లభిస్తుంది. సముద్రపు చేపలు(fish), పీతలు, రొయ్యల(prance) వల్ల కూడా ఐరన్ లభిస్తుంది.
ఇక వెజిటేరియన్లు(vegetarians) అయితే సిట్రస్ పండ్లను ఎక్కువగా తీసుకోవాలి. నారింజ పండ్లు, బీన్స్(beans) వంటి వాటిని నిత్యం ఆహారం(food)లో భాగం చేసుకోవాలి. విటమిన్ సి ఉండే ఆహార పదార్థాల(food items)ను తీసుకోవడం వల్ల శరీరంలో ఐరన్ వృద్ధి చెందుతుంది. ఆకుపచ్చని కూరగాయలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రక్త హీనత సమస్య నుంచి బయటపడొచ్చు. వీటిలో ఉండే ఐరన్ శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. అవిసె గింజలు, గుమ్మడి కాయ విత్తనాలు, జీడిపప్పు, పిస్తాలు, తృణ ధాన్యాలను నిత్యం తీసుకోవాలి ఇలా చేయడం వల్ల రక్త హీనతకు చెక్ పెట్టొచ్చు. బీట్‌రూట్ వంటి ఎరుపు రంగులో ఉండే కూరగాయలను తీసుకోవడం వల్ల శరీరంలో రక్తం బాగా తయారవుతుంది. ఇలా మంచి బలవర్ధక ఆహారం తీసుకొని రక్తహీనతకు చెక్ పెట్టండి.