top of page

అల్పాహారంలో ఈ ఐదు వస్తువులను అస్సలు తినకండి .. తినే ప్రమాదం.

మనలో చాలా మంది ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ గా ఏది కనిపిస్తే అది లాగిస్తూ ఉంటారు. అయితే ఈ కింది ఫుడ్ ఐటెమ్స్ ను టిఫిన్ గా తీసుకుంటే అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆ ఫుడ్ ఐటెమ్స్ ఏంటో తెలుసుకోండి.

1. Processed Food- ఉదయం అల్పాహారం కోసం ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తినడం మానేయాలి. ప్రాసెస్ చేసిన లేదా ప్యాక్ చేసిన ఆహారాన్ని తినడం వల్ల మీ శరీరంలో కొవ్వు పెరుగుతుంది. ఇందులో అధిక మొత్తంలో ఉండే నూనె, సుగంధ ద్రవ్యాలు మొదలైన వాటి వల్ల ఆరోగ్యానికి చాలా హానికరం. చిప్స్, పాప్‌కార్న్ వంటి వాటిని పొద్దున్నే అస్సలు తినొద్దు.(ప్రతీకాత్మక చిత్రం)


2. Cakes- పిండి, చక్కెర అధికంగా ఉండే కేకులను ఉదయం బ్రేక్ ఫాస్ట్ గా తీసుకోవడం అస్సలు మంచిది కాదు. ఈ పదార్థాలన్నీ శరీరానికి చాలా హానికరం. అల్పాహారం కోసం రొట్టె, కూర లేదా పండ్లను తినడం మేలు.(ప్రతీకాత్మక చిత్రం)


3. Noodles- నూడుల్స్ తినడానికి చాలా రుచికరరంగా ఉన్నప్పటికీ అల్పాహారంగా దీనిని అస్సలు తినొద్దు.(ప్రతీకాత్మక చిత్రం)


4. Fruit Juice - మార్కెట్లో లభించే ఫ్రూట్ జ్యూస్ అల్పాహారం కోసం మంచి ఎంపిక అని చాలా మంది అనుకుంటారు. కానీ ఇది అపోహ మాత్రమే అని నిపుణులు చెబుతున్నారు. ఈ రసంలో ఎక్కువగా చక్కెర ఉంటుంది. ఇది మీ బరువును పెంచుతుంది. దీని బదులుగా ఇంట్లో తయారుచేసిన తాజా రసం తీసుకోండి. లేకపోతే పండ్లను తినండి. ఇవి చాలా ఫైబర్ కలిగి ఉంటాయి. మరియు ఇందులో చక్కెర ఉండదు.


5. Poori, Parotta- ఉదయం నూనెలో వేయించిన వాటిని తినకుండా ఉండడం చాలా మంచిది. పూరి, పరోటా లాంటి పదార్థాల బదులుగా ఉదయాన్నే బ్రెడ్, వోట్స్, పండ్లు తినండి.(ప్రతీకాత్మక చిత్రం)