top of page

Green Chilli: మీరు పచ్చి మిరపకాయలకు దూరంగా ఉంటారా?..ఐతే ఈ ప్రయోజనాలు మిస్ అవుతారు

Green Chilli Benefits: పచ్చి మిర్చిని చాలామంది వివిధ ఆరోగ్య కారణాల వల్ల దూరం పెడుతుంటారు. కానీ దీని వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి.


పచ్చిమిర్చి కారంగా ఉంటుంది. కానీ దాన్లో పుల్లటి విటమిన్ C కూడా ఉంటుంది. రోజూ ఓ పచ్చి మిరప తింటే... బాడీకి కావాల్సిన విటమిన్ C కొరత కొంత తీరుతుంది. జ్వరం, దగ్గు, జలుబు తగ్గాలంటే పచ్చి మిర్చి తినాలి.


పచ్చిమిర్చిలో ప్రొస్టేట్ కాన్సర్‌రు తగ్గించే గుణాలున్నాయి. అందువల్ల ఇది ఎంతో మంచిదని అనుకోవచ్చు. మిర్చిని వంట వండిన తర్వాత... సన్నగా తరిగి కూరలో వేసేసుకుంటే.. దాన్లో గుణాలు పోకుండా... శరీరానికి అందుతాయి.


పచ్చిమిర్చి ఆహారాన్ని జీర్ణం చేయడంలోనూ బాగా పనిచేస్తుంది. మీరు తినే ఆహారాల్లో చిల్లీ సాస్ వేసుకొని తినండి... ఎక్కువ ప్రయోజనం కలుగుతుంది.


కరోనా మాత్రమే కాదు... చాలా రకాల వైరస్‌లు, బ్యాక్టీరియాకు పచ్చిమిర్చి మందులా పనిచేస్తుంది. ఎందుకంటే మిర్చిలో యాంటీఆక్సిడెంట్స్ ఉంటాయి.


మన చర్మాన్ని కోమలంగా, కాంతి వంతంగా చెయ్యడంలో పచ్చి మిర్చి లోపలి నుంచి సాయపడతాయి. రోజూ ఒక్క పచ్చిమిర్చైనా తింటే... చాలా రకాల వ్యాధులకు దూరంగా ఉండొచ్చు. ముఖ్యంగా దగ్గు, జలుబు, జ్వరం నుంచి వేగంగా విముక్తి కావాలంటే పచ్చిమిర్చిని తినడమే.