top of page

World Egg Day 2021 : ప్రతిరోజూ 2 గుడ్లు తింటే ఏమవుతుందో తెలుసా?

Egg benefits: గుడ్డులోని పచ్చసొనలో కోలిన్‌ ఉంటుంది. ఇది జీవక్రియను నియంత్రిస్తుంది. బరువు తగ్గడానికి కారణమవుతుంది. అందుకే ఇకపై ఎగ్‌ తింటే ఎల్లోను పక్కకు తీసిపెట్టకండి.

గుడ్డు.. ఇందులో ఉండే ప్రోటీన్స్‌ విటమిన్స్‌ వల్ల ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఇమ్యూనిటీ బూస్ట్‌ Immunity boost అవుతుంది. అంతేకాదు దీంతో జలుబును వంటి అనారోగ్య సమస్యలను కూడా తగ్గించుకోవచ్చు.కొందరు గుడ్లలో ఉండే ఎల్లో పార్ట్‌ను తీసేసి కేవలం వైట్‌ ఎగ్‌ను మాత్రమే తింటారు. కానీ, కొన్ని నివేదికలు తెలిపిన ఆశ్చర్యకర నిజాలు ఏమిటంటే.. ఈ గుడ్డు పచ్చసొనతో బరువు తగ్గే గుణం ఉందట. అందుకే ఇకపై ఎగ్‌ ఎల్లోను తీసేయకుండా.. తినండి అంటున్నారు నిపుణులు.


అందుకే, గుడ్డు ప్రతిరోజూ తింటే ఆరోగ్యానికి మంచిది అంటారు. ముఖ్యంగా ఇందులో ఉండే పచ్చసొన శరీరంలోని కొవ్వును తగ్గించడంతోపాటు వెయిట్‌ను సమతూల్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అన్ని వయస్సువారు గుడ్లు తింటే మంచి ఫలితం ఉంటుంది. ఆరోగ్యానికే కాదు.. అందంలో కూడా గుడ్డుది ప్రత్యేక స్థానం. బ్యూటీ, హెయిర్‌ కేర్‌లో కూడా ఎగ్‌ను వాడతారు.


గుడ్డులోని పచ్చసొనలో కోలిన్‌ ఉంటుంది. ఇది జీవక్రియను నియంత్రిస్తుంది. బరువు తగ్గడానికి కారణమవుతుంది. అందుకే ఇకపై ఎగ్‌ తింటే ఎల్లోను పక్కకు తీసిపెట్టకండి..


బ్రేక్‌ఫాస్ట్‌లో గుడ్డును పూర్తిగా తింటే.. అది ఆకలిని తగ్గిస్తుంది. కడుపు నిండుగా అనిపిస్తుంది.అందువల్ల ఫుడ్‌ ఎక్కువ తినడాన్ని తగ్గించుకోవచ్చు. ఇందులో విటమిన్‌ బీ, అమైనో ఆమ్లాం మెదడు ఆరోగ్యానికి కృషి చేస్తాయి.దీంతో రోజంతా మెదడు అలసిపోకుండా చురుగ్గా పనిచేస్తుంది. అందుకే ప్రతిరోజు పిల్లలకు కూడా ఒక గుడ్డు ఇవ్వాలి అంటారు.


గుడ్డు గుడ్‌ ఫ్యాట్‌ లెవల్స్‌ను సమతూల్యం చేస్తాయి. సాధారణంగా మన శరీరం సూర్యకాంతి నుంచి విటమిన్‌ డీని పొందుతుంది. కానీ, ఫుడ్‌ విషయానికి వస్తే.. విటమిన్‌ డీ ఉండే ఆహార పదార్థాలు చాలా తక్కువ. గుడ్డులోని పచ్చ సొనలో ఈ విటమిన్‌ పుష్కలంగా ఉంటుంది. దీంతో రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి సహాయపడుతుంది.అయితే, గుడ్లను మరీ అతిగా తినకూడదు. రోజుకు రెండు గుడ్లు తింటే సరిపోతుంది. అయితే, ఇది కూడా ఉదయం లేవగానే త్వరగా బ్రేక్‌ఫాస్ట్‌ తినేయడం మంచిది.