top of page

DRDO Recruitment 2021: డీఆర్‌డీఓలో 106 ఉద్యోగాలు... ఆ అర్హతలు ఉంటే చాలు

DRDO Apprentice Recruitment 2021 | ఐటీఐ, డిప్లొమా, బీటెక్ లాంటి కోర్సులు పాస్ అయినవారికి అలర్ట్. డీఆర్‌డీఓ 106 ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. ఈ జాబ్ నోటిఫికేషన్ (Job Notification) వివరాలు తెలుసుకోండి.

డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) ఉద్యోగాల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. గ్రాడ్యుయేట్ అప్రెంటీస్, ట్రేడ్ అప్రెంటీస్, టెక్నీషియన్ (డిప్లొమా) అప్రెంటీస్ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 106 ఖాళీలున్నాయి. ఇవి అప్రెంటీస్ పోస్టులు మాత్రమే. అప్రెంటీస్ గడువు ఒక ఏడాది ఉంటుంది. ఒడిశాలోని చండీపూర్‌లో ఉన్న ప్రీమియర్ ల్యాబరేటరీ ఇంటిగ్రేడెట్ టెస్ట్ రేంజ్‌లో (ITR) ఈ పోస్టులున్నాయి. ఈ పోస్టులకు 2021 నవంబర్ 1న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. అదే రోజున https://rac.gov.in/ వెబ్‌సైట్‌లో అప్లికేషన్ లింక్ యాక్టివేట్ అవుతుంది. అప్లై చేయడానికి 2021 నవంబర్ 15 చివరి తేదీ. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. దరఖాస్తు చేసేముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతలు తెలుసుకోవాలి.


గ్రాడ్యుయేట్ అప్రెంటీస్, టెక్నీషియన్ (డిప్లొమా) అప్రెంటీస్ అభ్యర్థులు https://www.mhrdnats.gov.in/ వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేయాలి. ట్రేడ్ అప్రెంటీస్ అభ్యర్థులు https://www.apprenticeshipindia.gov.in/ వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేయాలి. ఆ తర్వాతే డీఆర్‌డీఓ అధికారిక వెబ్‌సైట్ https://rac.gov.in/ లో దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయాలి. ఈ జాబ్ నోటిఫికేషన్‌కు సంబంధించిన ఇతర వివరాలు, విద్యార్హతలు, దరఖాస్తు విధానం గురించి తెలుసుకోండి.


DRDO Apprentice Recruitment 2021: ఖాళీల వివరాలు ఇవే...

మొత్తం ఖాళీలు

106

గ్రాడ్యుయేట్ అప్రెంటీస్

50

టెక్నీషియన్ (డిప్లొమా) అప్రెంటీస్

30

ట్రేడ్ అప్రెంటీస్

26

DRDO Apprentice Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు