top of page

Drinking Raw Milk: మీరు పచ్చి పాలు తీసుకుంటున్నారా? అత్యంత ప్రమాదకరం ... ఎందుకు కనుగొనండి

Effects of Drinking Raw Milk | పాలు ఆరోగ్యానికి ఎంతో మంచిది. బలవర్ధకమైన ఆహారం. ఉదయం, రాత్రి పాలు తాగడం మనలో చాలా మందికి అలవాటు. ఐతే పాలను ఇంటికి తెచ్చుకున్న తర్వాత... కాచి చల్లార్చకుండా కొందరు నేరుగా తాగుతారు. కానీ అలా చేయకూడదట. చాలా ప్రమాదమట.

పట్టణాలు, నగరాల్లో ప్యాకెట్ పాలు లభిస్తాయి. అదే గ్రామాల్లో చాలా మంది గేదెలు, ఆవుల నుంచి పితికిన పాలను నేరుగా సేకరిస్తారు. వాటిని బాగా మరగబెట్టి చల్లారిన తర్వాత ఉపయోగిస్తారు. కానీ కొందరు మాత్రం అలాగే పచ్చి పాలను తాగుతారు.


పచ్చి పాలలో పలు రకాల బ్యాక్టీరియాలు ఉంటాయి. ఈ బ్యాక్టీరియాలు ఉండే పాలను తాగితే కీళ్ల వాపు, డయేరియా, డీహైడ్రేషన్ వంటి అనారోగ్య సమస్యలు వస్తాయి.


కొందరు పాలు పితికే సమయంలో నీళ్లు, ఇతర పదార్థాలను కలుపుతారు. అంతేకాలు అక్కడి వాతావరణాన్ని బట్టి కొన్ని మలినాలు కలుస్తాయి. అలాంటి పాలను నేరుగా తాగితే ఉదర సంబంధ ఇబ్బందులు తప్పవు.


వేడి చేయని అపరిశుభ్రమైన పాలు తాగితే ట్యుబర్కులోసిస్ అనే ప్రమాదకర జబ్బు వచ్చే అవకాశముంది. బ్యాక్టీరియా వల్ల ఊపరితితులపై ఈ వ్యాధి ప్రభావం చూపుతుంది.


బ్యాక్టీరియా ఉండడం వల్ల పచ్చి పాలు త్వరగా పాడవుతాయి. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండే వారు పచ్చి పాలను తీసుకోవద్దు. బాగా మరగబెట్టిన తర్వాత తీసుకోవాలి.


పచ్చి పాలు తాగడం వల్ల శరీరంలో ఆమ్ల స్థాయి పెరుగుతుంది. శరీరంలో యాసిడ్ పెరిగతే ఎసిడిటీ, అజీర్తి వంటి సమస్యలు వస్తాయి. అందుకే పచ్చిపాలు తాగకపోవడమే శ్రేయస్కరం.