Flipkart Big Billion Days: ఫ్లిప్‌కార్ట్ సేల్ మరో రెండు రోజులే... రూ.15,000 లోపు బెస్ట్ స్మార్ట్‌ఫోన
Flipkart Smartphone Offers | ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ (Flipkart Big Billion Days Sale) మరో రెండు రోజుల్లో ముగియనుంది. రూ.15,000 లోపు బడ్జెట్‌లో (Best Smartphone under Rs 15,000) స్మార్ట్‌ఫోన్ వెతుకుతున్నారా? మీ బడ్జెట్ రూ.15,000 లోపు అయితే ఈ 10 స్మార్ట్‌ఫోన్స్‌పై ఓ లుక్కేయండి.

Realme 8i: రియల్‌మీ 8ఐ స్మార్ట్‌ఫోన్ 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్ అసలు ధర రూ.13,999 కాగా ఆఫర్‌లో రూ.12,999 ధరకే లభిస్తుంది. అదనంగా ఎక్స్‌ఛేంజ్ డిస్కౌంట్ రూ.1,000 లభిస్తుంది. యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డులతో అదనంగా 10 శాతం తగ్గింపు పొందొచ్చు. ఆఫర్స్ అన్నీ కలిపి రూ.10,799 ధరకే ఈ ఫోన్ కొనొచ్చు. (image: Realme India)

Moto G60: మోటో జీ60 స్మార్ట్‌ఫోన్ 6జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ఆఫర్ ధర రూ.15,999. యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డులతో అదనంగా 10 శాతం తగ్గింపు పొందొచ్చు. ఆఫర్స్ అన్నీ కలిపి రూ.14,999 ధరకే ఈ ఫోన్ కొనొచ్చు.

Oppo A53s 5G: ఒప్పో ఏ53ఎస్ 5జీ స్మార్ట్‌ఫోన్ 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ అసలు ధర రూ.15,990 కాగా, ఆఫర్ ధర రూ.13,490. యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో అదనంగా 10 శాతం డిస్కౌంట్ పొందొచ్చు. ఆఫర్స్ అన్నీ కలిపి రూ.12,141 ధరకే ఈ ఫోన్ కొనొచ్చు.