Flipkart Smartphones Carnival Sale ప్రారంభం.. ఐఫోన్, రియల్‌మీ స్మార్ట్‌ఫోన్‌లపై కళ్లు చెదిరే ఆఫర్లు
ఫ్లిప్‌కార్ట్ కార్నివల్ సేల్‌లో ఐఫోన్ 12పై కళ్లు చెదిరే డిస్కౌంట్ ప్రకటించింది. ఐఫోన్ 12 64GB స్టోరేజ్ బేస్ వేరియంట్ అసలు ధర రూ .79,900 వద్ద ఉండగా.. ఇప్పుడు దీన్ని కేవలం రూ. 66,999 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు.

ఈ–కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ మరోసారి స్మార్ట్‌ఫోన్ కార్నివాల్ సేల్‌తో ముందుకొచ్చింది. సేల్‌లో భాగంగా ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌లపై అదిరిపోయే ఆఫర్లను ప్రకటించింది. ఇప్పటికే ప్రారంభమైన ఈ సేల్ సెప్టెంబర్ 8 వరకు కొనసాగనుంది. మొత్తం నాలుగు రోజుల పాటు లైవ్‌లో ఉండే ఈ సేల్‌లో ఐఫోన్ 12, ఐఫోన్ 12 మినీ, రియల్‌మే ఎక్స్ 7 మ్యాక్స్ సహా అనేక స్మార్ట్‌ఫోన్‌లపై రూ .12,901 వరకు డిస్కౌంట్ ఇస్తోంది.
స్మార్ట్‌ఫోన్ కార్నివాల్ సేల్‌లో ఆఫర్లు
ఫ్లిప్‌కార్ట్ కార్నివల్ సేల్‌లో ఐఫోన్ 12పై కళ్లు చెదిరే డిస్కౌంట్ ప్రకటించింది. ఐఫోన్ 12 64GB స్టోరేజ్ బేస్ వేరియంట్ అసలు ధర రూ .79,900 వద్ద ఉండగా.. ఇప్పుడు దీన్ని కేవలం రూ. 66,999 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. అంటే, ఈ ఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్‌కు మీకు రూ .12,901 డిస్కౌంట్ ఇస్తుంది. ఇక, ఐఫోన్ 12 128GB స్టోరేజ్ మోడల్ అసలు ధర రూ. 84,900 వద్ద ఉండగా.. దీన్ని కేవలం రూ. 71,999 ధరకే అందుబాటులోకి తెచ్చింది. మరోవైపు, ఐఫోన్ 12 హై-ఎండ్ 256GB వేరియంట్ అసలు ధర రూ .94,900 వద్ద ఉండగా దీన్ని రూ .81,999 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. ఈ డిస్కౌంట్లతో పాటు రూ. 15,000 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను కూడా ఫ్లిప్‌కార్ట్ అందిస్తోంది. ఇక, ఫ్లిప్‌కార్ట్ స్మార్ట్‌ఫోన్ కార్నివాల్ సేల్‌లో ఐఫోన్ 12 మినీ రూ. 59,999 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. దీని అసలు ధర రూ .69,900 వద్ద ఉండగా దీనిపై రూ .9,901 తగ్గింపును అందిస్తోంది. ఐఫోన్ 11పై కూడా ఆఫర్ ప్రకటించింది. దీని అసులు ధర ధర రూ .54,900 వద్ద ఉండగా.. రూ .51,999 వద్ద అందుబాటులోకి తెచ్చింది. ఐఫోన్ XR అసలు ధర రూ. 47,900 ఉండగా.. దీన్ని రూ. 42,999 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు.
రియల్‌మీ ఫోన్లపై డిస్కౌంట్..
మీరు బెస్ట్ ఆండ్రాయిడ్ ఫోన్ కోసం చూస్తున్నట్లయితే, మీకు రియల్‌మీ X7 మాక్స్ బెస్ట్ ఆప్షన్. దీని అసలు ధర రూ .26,999 వద్ద ఉండగా.. ఫ్లిప్‌కార్ట్ రూ, 3000 డిస్కౌంట్ అందిస్తోంది. డెబిట్ లేదా క్రెడిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే ఈ డిస్కౌంట్ పొందవచ్చు. ఇక, మరో స్మార్ట్బ్రాండ్ ఇన్ఫినిక్స్ కంపెనీకి చెందిన ఇన్ఫినిక్స్ హాట్ 10S స్మార్ట్‌ఫోన్‌ను రూ .9,499 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. దీని అసలు ధర రూ .9,999 వద్ద ఉండగా.. రూ .500 తగ్గింపును అందిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ పోకో ఎం 3 ధరను కూడా తగ్గించింది. దీన్ని ఇప్పుడు రూ. 10,499 ధర వద్దే కొనుగోలు చేయవచ్చు. రియల్‌మీ నార్జో 30 5 జి స్మార్ట్‌ఫోన్‌ను రూ .14,999, శామ్‌సంగ్ గెలాక్సీ ఎఫ్ 41 స్మార్ట్‌ఫోన్‌ను రూ .14,499 వద్ద విక్రయిస్తోంది. ఈ రెండింటిపై రూ .1,000 తగ్గింపు పొందవచ్చు.