WhatsApp డెస్క్‌టాప్ యాప్‌లో వీడియో కాల్ చేయడం ఎలా?

వాట్సాప్ వీడియో కాల్ అనేది మొబైల్ అప్లికేషన్‌లో ఎక్కువగా ఉపయోగించే ఫీచర్. ఈ ఫీచర్ అధిక ప్రజాదరణను పొందింది. ఇటీవలి కరోనావైరస్ కాలంలో ఈ మెసేజింగ్ ప్లాట్‌ఫాం ఇటీవల తన డెస్క్‌టాప్ యాప్ కోసం కూడా వీడియో కాలింగ్ సామర్థ్యాన్ని పరిచయం చేసింది. దురదృష్టవశాత్తు వీడియో కాల్ ఫీచర్ వాట్సాప్ వెబ్ ప్లాట్‌ఫామ్‌లో ఇంకా అందుబాటులోకి రాలేదు. అయితే ఇది ఖచ్చితంగా వాట్సాప్ వెబ్ వినియోగదారుల కోసం కూడా తీసుకురావాలని కోరుకునే ఫీచర్.
వెబ్‌లో వాట్సాప్ వీడియో కాలింగ్ సామర్ధ్యాన్ని పరిచయం చేసే వరకు వేచి ఉండవలసి ఉంటుంది. వినియోగదారులు ప్రస్తుతం తమ PC లేదా ల్యాప్‌టాప్‌లో డెస్క్‌టాప్ యాప్‌ను ఉపయోగించి తమ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులకు ఈ ప్లాట్‌ఫారమ్ ద్వారా వీడియో కాల్ చేయడానికి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. వాట్సాప్ డెస్క్‌టాప్ యాప్ వీడియో కాలింగ్ ఫీచర్ విండోస్ మరియు మాక్‌లో సజావుగా పనిచేస్తుంది. అయితే ఈ విధానంలో ఎలా కొనసాగాలో వంటి వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.
వాట్సాప్ డెస్క్‌టాప్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసే విధానం
స్టెప్ 1: మీ Windows / Mac ల్యాప్‌టాప్ లేదా PC లో WhatsApp డెస్క్‌టాప్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవలసి ఉంటుంది.
స్టెప్ 2: WhatsApp డెస్క్‌టాప్ యాప్ డౌన్‌లోడ్ అయిన తర్వాత దాన్ని PC లో ఇన్‌స్టాల్ చేయండి.
స్టెప్ 3: వినియోగదారుడి యొక్క పేరు, ఫోన్ నంబర్ మరియు ఇతర వివరాలతో లాగిన్ చేయండి. విండోస్ 10 64-బిట్ వెర్షన్ 1903 లేదా కొత్త మరియు మాకోస్ 10.13 లేదా కొత్త వెర్షన్‌లలో మాత్రమే వీడియో కాల్ సపోర్ట్ అందుబాటులో ఉందని గమనించాలి. వాట్సాప్ డెస్క్‌టాప్ వన్-టు-వన్ కాల్‌ను మాత్రమే అనుమతిస్తుంది అని వినియోగదారులు గమనించాలి. డెస్క్‌టాప్ వినియోగదారుల కోసం మెసేజింగ్ ప్లాట్‌ఫాం ఇంకా అధికారికంగా గ్రూప్ కాల్ మద్దతును విడుదల చేయలేదు.
WhatsApp డెస్క్‌టాప్ యాప్‌లో వీడియో కాల్ చేయడం ఎలా
స్టెప్ 1: మీ PC లో Windows లేదా Mac కోసం WhatsApp డెస్క్‌టాప్ యాప్‌ని ఇన్‌స్టాల్ చేయండి.
స్టెప్ 2: మీ కంప్యూటర్‌లో మీ ఫోన్ నుండి QR కోడ్‌ని స్కాన్ చేయండి.
స్టెప్ 3: మీ WhatsApp అకౌంట్ ఇప్పుడు డెస్క్‌టాప్‌లో ఓపెన్ చేయబడుతుంది.