Bad cholesterol: మీ కాళులో చెడు కొలెస్ట్రాల్ ఉంటే.. ఈ లక్షణాలు..!
అనారోగ్యంగా ఉన్నపుడు ఆహారంలో చెడు కొవ్వులు శరీరంలో కలిసిపోతాయి. ఇవి ధమనుల్లో పేరుకుపోయి చివరికి గుండెపోటు, స్ట్రోక్ వంటి ప్రాణాంతక సమస్యలకు దారితీస్తుంది.
అనారోగ్యకరమైన లైఫ్‌కు ప్రధాన కారణం ఫుడ్. మన శరీరంలో రెండు రకాల కొవ్వులు ఉంటాయి. ఆరోగ్యకరమైన కొవ్వులు, అనారోగ్యకరమైన కొవ్వులు Bad cholesterol. కాలేయం ద్వారా ఉత్పత్తి అయ్యే ఈ కొవ్వు హార్మొన్లను సమతూల్యంగా ఉంచడంలో విటమిన్ డీ కీలకపాత్ర పోషిస్తుంది.
లిపోప్రోటీన్ అనే కణం శరీరానికి అవసరమయ్యే కొలెస్ట్రాల్‌ను శరీరంలోని అన్ని భాగాలకు చేరవేస్తుంది. తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రోటీన్లను ఏర్పరుస్తుంది. ఇవి అ«ధిక ఫ్యాట్, తక్కువ ప్రోటీన్ కలిగి ఉంటాయి. ఇవి శరీరానికి హాని కలిగించేవి.

కాళ్లలో ఫ్యాట్ పేరుకుపోతే..
కొలెస్ట్రాల్ సమస్యకు ప్రమాద కారకం ఏమిటంటే.. ఇది శరీరంలో ప్రమాదకరమైన స్థాయికి చేరుకుని, రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసే వరకు ఏ లక్షణాలు కనిపించవు. కొలెస్ట్రాల్ సమన్యను తప్పించుకోవాలంటే.. క్రమం తప్పకుండా రక్త పరీక్ష చేయించుకోవాలి. రక్తంలో అధిక కొలెస్ట్రాల్ పెరిగే కొద్దీ కాళ్లలో నొప్పలు ప్రారంభమవుతాయి.
కాళ్లలోని ధమనులు మూసుకుపోయినపుడు తగినంత ఆక్సిజన్ కాళు కింద భాగానికి రక్తం చేరదు. అప్పుడు వీక్ అయిపోతుంది. ఈ సమస్య చాలా మందిలో సంభవిస్తుంది. తొడ భాగంతోపాటు కాళు మొత్తం ఎక్కువ నొప్పి ఉన్నట్టయితే కొలెస్ట్రాల్ లెవల్‌ను పరీక్షించుకోవాలి.
కాళ్ల తిమ్మిరి..
కొలెస్ట్రాల్ సమస్య ఉన్నవారికి కాళ్లు తిమ్మిరిగా ఉంటాయి. నిద్రలో తీవ్రమైన కాళ్లనొప్పులు, మడమలు, కాళివేళ్లలో తీవ్రమైన నొప్పి వస్తుంది. కాళ్లు వేలాడదీసినపుడు మాత్రమే నొప్పి తక్కువగా ఉన్నట్లు భావిస్తారు.
చర్మం, గోళ్ల రంగులో మార్పు..
రక్త ప్రసరణ తగ్గడం వల్ల గోళ్లు, చర్మం రంగు మారుతుంది. రక్తానికి అవసరమైన ఆక్సిజన్ సరిగ్గా లభించనపుడు గోళ్ల రంగు మారుతుంది. ఒకవేళ మీ గోళ్ల రంగు మారితే.. తగినంత పోషకాహారం అందడం లేదని అర్థం. మందంగా, నెమ్మదిగా పెరుగుతున్న గోళ్లపై కొలెస్ట్రాల్‌కు సంకేతం.