మీ ఎర్ర రక్త కణాల సంఖ్యను పెంచడానికి వాటిని తీసుకోండి.
డీఎన్ఏ డెవలప్ అవ్వడానికీ, ఎర్ర రక్త కణాలు ఆరోగ్యంగా పెరగడానికీ విటమిన్ బీ12 అవసరం. ఇది నీటిలో కరిగే విటమిన్. ఈ విటమిన్ ఫోలిక్ యాసిడ్‌తో కలిసి ఎర్ర రక్త కణాల పెరుగుదలకి దోహదం చేస్తుంది, ఈ ఎర్ర రక్త కణాలే శరీరం అంతా ఆక్సిజెన్ సప్లైకీ సర్క్యులేషన్ కీ హెల్ప్ చేస్తాయి.

అయితే, వచ్చిన చిక్కల్లా ఏమిటంటే శరీరం ఈ విటమిన్ ని తనంతట తను తయారు చేసుకోలేదు. అందుకే దీనిని ఆహారం ద్వారా కానీ, సప్లిమెంట్స్ ద్వారా కానీ తీసుకోవాలి. అయితే, చాలా మంది అనుకునేది ఏమిటంటే విటమిన్ బీ12 కేవలం నాన్ వెజ్ డైట్ ద్వారానే అందుతుందని. అంటే, కేవలం శాకాహారం మాత్రమే తీసుకునే వారికి ఈ అతి ముఖ్యమైన విటమిన్ అందకుండా పోతుందా? వీరు ఈ విటమిన్ కొరకు సప్లిమెంట్స్ మీద ఆధారపడవలసిందేనా?
విటమిన్ బీ12 సోర్సెస్ ఏమిటి..
విటమిన్ బీ12 మట్టిలో చాలా ఎక్కువగా ఉంటుంది. శాకాహార జంతువులు మొక్కలు తిన్నప్పుడు ఆ మొక్కకి అంటి ఉన్న మట్టితో సహా తింటాయి, దాంతో ఆ జంతువుకి ఈ విటమిన్ పుష్కలంగా అందుతుంది. అందుకే, నాన్ వెజ్ తినేవారికి ఈ విటమిన్ తేలికగా అందుతుంది.
అయితే, ప్రస్తుతం మనం గమనించవలసిన విషయం ఏమిటంటే, ఈ రోజుల్లో మట్టిలో కూడా ఎన్నెన్నో రకాల కెమికల్స్, ఎరువులు, హానికరమైన పురుగు మందులు ఉంటున్నాయి. మనం చిలగడ దుంపలు, టమాటాలు, ముల్లంగి, ఉల్లిపాయ వంటివి తీసుకున్నా కూడా మనకి విటమిన్ బీ12 అందదు, ఎందుకంటే మనం వాటిని శుభ్రంగా కడిగి, క్లీన్ చేసి తింటాం కదా. అంతే కాక, మట్టిలో ఆడుకోవడం అనేది పూర్తిగా పక్కకి వెళ్ళిపోయింది కాబట్టి మట్టితో ఎలాంటి కనెక్షన్ లేకుండా పోయింది,
విటమిన్ బీ12 లెవెల్స్‌ని ఎలా పెంచుకోవాలి..
ఈ విటమిన్ ఎక్కువగా యానిమల్ సోర్సెస్‌లో ఉంటుంది, ప్రత్యేకించి మీట్, డైరీ ప్రోడక్ట్స్ లో. అయితే, వేగన్స్ కోబాల్ట్ ఫుడ్స్, ఫోర్టిఫైడ్ సోర్సెస్ ద్వారా ఈ విటమిన్ ని అందుకోవచ్చు.
విటమిన్ బీ12 తగినంత లేకపోతే ఏం జరుగుతుంది..
శరీరం లో తగినంత బీ12 లేకపోతే ఎర్ర రక్త కణాలు తక్కువగా ఉంటాయి, ఆక్సిజెన్ సప్లై కూడా తక్కువగానే ఉంటుంది. ఫలితంగా, ఆయాసం, ఓపిక లేకపోవడం, అలసట, నీరసం ఉంటాయి.
ఈ లక్షణాలు కనిపించగానే మాంటే, విట్నకి వచ్చే మొదటి ఆలోచన సరిగ్గానే ఆహారం తీసుకుంటున్నామా, ఎక్సర్సైజ్ చేస్తున్నామా.. అని రకరకాలుగా ఆలోచిస్తాం. కానీ, అసలు కారణం విటమిన్ బీ12 లోపం వల్ల కావచ్చు.
ఎర్ర రక్త కణాలు సరిగ్గా ఫార్మ్ కాకపోతే అది అనేక రకాల సమస్యలకి దారి తీయవచ్చు. ఉదాహరణకి, బోన్ మారో లో ఎర్ర రక్త