TCS Recruitment: టీసీఎస్‌లో 500 పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం..వివరాలివే
ప్రముఖ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ టీసీఎస్ కార్యాలయాల్లో దాదాపు 500 పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

ప్రముఖ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ టీసీఎస్ కార్యాలయాల్లో దాదాపు 500 పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. కేవలం సింగిల్ స్టేజ్ ఇంటర్వ్యూ ప్రక్రియ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనుంది. "ఎప్పటికప్పుడు మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా కొత్త కోర్సుల్లో నైపుణ్యాన్ని సాధించే అభ్యర్థులకు టీసీఎస్ పెద్ద పీట వేస్తోంది. ఐటీ రంగంలో కెరీర్‌ను రూపొందించుకునే వారికి అవకాశాలు కల్పిస్తోంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి ఆకర్షణీయమైన వేతనంతో పాటు అదనంగా బోనస్, ఇతద సౌకర్యాలు లభిస్తాయి. ఐటీ రంగంలో ఉన్నతమైన కెరీర్‌ను కోరుకునే వారికి ఇది చక్కటి అవకాశం.”అని కంపెనీ తన అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొంది.
పోస్టుల వివరాలు..
ఈ రిక్రూట్మెంట్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న టీసీఎస్ కార్యాలయాల్లో ఎస్‌క్యూఎల్ సర్వర్ డీబీఏ, లైనక్స్ అడ్మినిస్ట్రేటర్, నెట్‌వర్క్ అడ్మిన్, మెయిన్‌ఫ్రేమ్ అడ్మిన్, ఆటోమేషన్ టెస్టింగ్, పర్ఫార్మెన్స్ టెస్టింగ్ కన్సల్టెంట్, ఆంగ్యులర్ జేఎస్, ఒరాకిల్ డీబీఏ, సిట్రిక్స్ అడ్మినిస్ట్రేటర్, జావా డెవలపర్, డాట్నెట్ డెవలపర్, ఆండ్రాయిడ్ డెవలపర్, ఐఓఎస్ డెవలపర్, విండోస్ అడ్మిన్, పైథాన్ డెవలపర్, పీఎల్ఎస్క్యూఎల్ పోస్టులను భర్తీ చేయనుంది.
టీసీఎస్ iON కెరీర్ ఎడ్జ్ ప్రోగ్రామ్
గ్రాడ్యుయేట్ల కెరీర్‌కు ఊతమిచ్చేలా టీసీఎస్ 15 రోజుల ఉచిత కోర్సులను అందిస్తోంది. టీసీఎస్ అయాన్ కెరీర్ ఎడ్జ్ అనే పేరుతో ఈ ప్రోగ్రామ్‌ను నిర్వహిస్తోంది. ఈ కోర్సు ద్వారా 15 రోజుల పాటు యువతకు కెరీర్ సంబంధిత టెక్నాలజీస్‌పై అవగాహన కల్పిస్తోంది. అండర్ గ్రాడ్యుయేట్లు, గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు, ఫ్రెషర్లు ఈ ప్రోగ్రామ్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. కోర్సులో భాగంగా బిహేవియర్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్, అకౌంటింగ్ ఐటీ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో బేసిక్స్‌పై అవగాహన కల్పిస్తారు.
టీసీఎస్ iON కెరీర్ ఎడ్జ్ ప్రోగ్రామ్‌లో యంగ్ ప్రొఫెషనల్స్‌కు 14 మాడ్యూల్స్‌పై శిక్షణ ఉంటుంది. ప్రతి మాడ్యూల్‌కు 1 నుంచి 2 గంటల వ్యవధిలో వీడియోలు, ప్రెజెంటేషన్‌లు, రీడింగ్ మెటీరియల్, టీసీఎస్ ఎక్స్పర్ట్స్ చేత వెబ్‌నార్లు వంటివి నిర్వహిస్తారు. ఈ ప్రోగ్రామ్‌లో విద్యార్థులు తమ ప్రశ్నలకు సందేహాలను అప్పటికప్పుడే నివృత్తి చేసుకోవచ్చు. ఈ ప్రోగ్రామ్‌ను విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత సర్టిఫికెట్ అందజేస్తారు. ఇది మీ ఉద్యోగ వేటలో ఉపయోగపడుతుంది.