top of page

Jobs in India: ఈ ఏడాది 50 లక్షల ఉద్యోగాలు: ఎస్‌స్‌బీఐ ఆర్థికవేత్తల అంచనా

క‌రోనా కార‌ణంగా అత‌లాకుత‌లం అయిన ఆర్థిక వ్య‌వ‌స్థ నెమ్మ‌దిగా ఇప్పుడే గాడిలో ప‌డుతోంది. ఈ ఏడాది ఆర్థికంగా మెరుగైన అవ‌కాశాలు ల‌భిస్తున్నాయని ఎస్‌బీఐ(SBI) ఆర్థిక వేత్త‌లు చెబుతున్నారు. క‌రోనా స‌మ‌యంలోనూ ప‌లు కంపెనీలు త‌మ వ్యాపార మార్గాల‌ను అభివృద్ధి చేసుకొనేందుకు కొత్త‌వారిని ఉద్యోగాల్లోకి తీసుకొంటున్న‌ట్టు వీరు పేర్కొన్నారు.



క‌రోనా కార‌ణంగా అత‌లాకుత‌లం అయిన ఆర్థిక వ్య‌వ‌స్థ నెమ్మ‌దిగా ఇప్పుడే గాడిలో ప‌డుతోంది. ఈ ఏడాది ఆర్థికంగా మెరుగైన అవ‌కాశాలు ల‌భిస్తాయిన ఎస్‌బీఐ(SBI) ఆర్థిక వేత్త‌లు చెబుతున్నారు. క‌రోనా స‌మ‌యంలోనూ ప‌లు కంపెనీలు త‌మ వ్యాపార మార్గాల‌ను అభివృద్ధి చేసుకొనేందుకు కొత్త‌వారిని ఉద్యోగాల్లోకి తీసుకొంటున్న‌ట్టు వీరు పేర్కొన్నారు. గ‌తేడాదిక‌న్నా 2021-2022లో ఉద్యోగ అవ‌కాశాలు(Job Opportunities) పెరుగుతాయ‌ని వారు అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు. ఎంప్లాయ్ ప్రావిడెంట్ ఫండ్ (employees provident fund), నేష‌న‌ల్ పెన్ష‌న్ స్కీమ్ (National pension scheme)లో క్ర‌మం త‌ప్ప‌కుండా విడుద‌ల అయ్యే ఫండ్‌ల ద్వారా ఈ స‌మాచారాన్ని క్రోడీక‌రించారు.


నిత్యం కొత్త వారు ఈపీఎఫ్ఓలో చేరుతుండ‌డం ఎంతో శుభ‌ప‌రిణామ‌న‌ని ఆర్థిక వేత్త‌లు చెబుతున్నారు. ‘కరోనా రెండో దశ అనంతరం ఆర్థిక వ్యవస్థ తిరిగి సాధారణ స్థాయికి వచ్చే క్రమంలో నిరుద్యోగం ఎక్కువవుతోందని, కార్మిక కార్యకలాపాల్లో తగ్గుదల కనిపిస్తోందన్న’ ఆందోళనల మధ్య ఈ అంచనాలు ఊరటనిస్తున్నాయి. సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ(సీఎమ్‌ఐఈ) అంచనా ప్రకారం.. ఆగస్టులో 15 లక్షల మంది ఉద్యోగాలు పోయాయి. ఇందులో 13 లక్షలు గ్రామీణ(Village) ప్రాంతంలోనివే కావడం గమనార్హం.


మొత్తం ఉద్యోగాల్లో కొత్త లేదా తొలి ఉద్యోగాల నిష్పత్తి 50 శాతంగా ఉంది. అంటే ప్రతి రెండు ఉద్యోగాల్లో ఒకటి కొత్తదని ఎస్‌బీఐ ఆర్థికవేత్త సౌమ్యకాంతి ఘోష్‌ అంటున్నారు. 2020-21తో పోలిస్తే ఇది 47 శాతం ఎక్కువని తెలిపారు. జూన్‌ త్రైమాసికంలో భారత్‌లో 30.74 లక్షల నియామకాలు జరిగాయి. ఇందులో 16.3 లక్షల ఉద్యోగాలు కొత్తవి. కొత్త నియామకాలు ఈ స్థాయిలో పెరిగితే 2021-22లో మొత్తం నియామకాలు 50 లక్షల మార్కును అధిగమించొచ్చు. 2020-21లో ఇవి 44 లక్షలుగా ఉన్నాయని ఎస్‌బీఐ నివేదిక తెలిపింది. ఏప్రిల్‌-జూన్‌లో ఈపీఎఫ్‌ నికర వినియోగదార్లు పెరగడం చూస్తుంటే కరోనా రెండో వేవ్ వల్ల కార్మిక మార్కెట్‌(Market)పై ప్రభావం తక్కువగానే ఉన్నట్లు లెక్క అని వివరించింది.


ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) విడుదల చేసిన తాజా డేటా ప్రకారం, ఏప్రిల్-జూన్ 2021 లో నికర కొత్త EPF చందాదారులు 28.9 లక్షల మంది ఉన్నారు ఈ గ‌ణాంకాలు ఆర్థిక ప‌రిస్థితికి ప్రోత్సాహకరంగా ఉంది. 2020-21తో పోలిస్తే ఇది 47 శాతం ఎక్కువని తెలిపారు. ఈ ఏడాది జూన్‌ త్రైమాసికంలో భారత్‌లో 30.74 లక్షల నియామకాలు జరిగాయి. ఇందులో 16.3 లక్షల ఉద్యోగాలు కొత్తవి. కొత్త నియామకాలు ఈ స్థాయిలో పెరిగితే 2021-22లో మొత్తం నియామకాలు 50 లక్షల మార్కును అధిగమించొచ్చు. 2020-21లో ఇవి 44 లక్షలుగా ఉన్నాయని ఎస్‌బీఐ నివేదిక తెలిపింది.


ఏప్రిల్‌-జూన్‌లో ఈపీఎఫ్‌ నికర వినియోగదార్లు పెరగడం చూస్తుంటే కరోనా రెండో దశ వల్ల కార్మిక మార్కెట్‌పై ప్రభావం తక్కువగానే ఉన్నట్లు లెక్క అని వివరించింది. రెండవ ఉద్యోగ సంఖ్య (అంటే, ప