top of page

హైదరాబాద్‌లో మందు బాబులకు తిప్పలే.. రెండు రోజులు మద్యం బంద్..

హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనం సంధర్బంగా రెండు రోజుల మద్యం షాపులు,బార్లు బంద్ కానున్నాయి. ఆదివారం ఉదయం నుండి సోమవారం సాయంత్రం 6 గంటల వరకు మద్యం షాపులు మూసి వేయాలని ఎక్సైజ్ శాఖ ఆదేశాలు జారీ చేసింది.


గణేష్ ఉత్సవాల చివరి ఘట్టం నిమజ్జనం . ఇందుకోసం రాష్ట్ర అధికారులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు.

నిమజ్జనంపై హైకోర్టు తీర్పుతో ఉత్కంఠ నెలకొనడంతో సుప్రీం కోర్టుకు వెళ్లిన అధికారలు హుస్సేన్ సాగర్‌లో పీవోపీ విగ్రహాల నిమజ్జనానికి అనుమతి తెచ్చారు


దీంతో గణేష్ ఉత్సవాల్లో భాగంగా రేపు ఎల్లుడి, రెండు రోజుల పాటు నిమజ్జనం కొనసాగనుంది. ఇందుకోసం

హైదరాబాద్‌లో నిమజ్జన కార్యక్రమం కోసం గణేశ్ నిమజ్జన విధుల్లో 19 వేల మంది పోలీసు సిబ్బంది పాల్గొననున్నారు. జిల్లాల నుంచి 7 వేల మంది పోలీసులను రప్పించినట్లు పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌

తెలిపారు.


మరోవైపు నిమజ్జనానికి పూర్తి ఏర్పాట్లు చేసినట్టు అధికారులు ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే రెండు రోజుల పాటు ఎలాంటీ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు మద్యం అమ్మకాలకు ఫుల్ ‌స్టాప్ పెట్టారు.


గణేష్ నిమజ్జనం సాఫిగా కొనసాగించేందుకు నగరం నలువైపుల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఇతర జిల్లాల నుండి వచ్చే భారీ వావాహాలకు నేటి అర్థరాత్రీ నుండే అనుమతి నిరాకరించారు.


దీంతో ఆదివారం ఉదయం నుండి పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ డైవర్షన్ చేశారు. గణేష్ శోభాయాత్ర కొనసాగే ఏరియాల్లో ట్రాఫిక్ నిబంధనలు వర్తించనున్నాయి. ఇందుకోసం ట్రాఫిక్ పోలీసులు రూట్ మ్యాప్ కూడా విడుదల

చేశారు.