top of page

సొంతంగా హెలికాప్టర్ తయారీ.. ఇంజిన్ స్టార్ట్ చేసిన కాసేపటికే ఘోరం.. బ్లేడ్ తగిలి తల పగిలింది

Updated: Aug 14, 2021


గతంలో ఒకసారి బెంగళూరుకు వెళ్లాడు ఇస్మాయిల్. హెలికాప్టర్ తయారీ సంస్థల ప్రతినిధులను కలిసి హెలికాప్టర్ తయారీలో మెలకువలు నేర్చుకున్నాడు. ఆ తర్వాత మారుతి 800 కారు ఇంజిన్‌తో హెలికాప్టర్ తయారీని ప్రారంభించాడు.





అందులో ఒక్కసారైనా విహరించాన్నది సామాన్యుడి కల. కానీ బాగా డబ్బులున్న వారే విమానాల్లో ప్రయాణిస్తారన్నది అందరికి తెలుసు. ఒక నగర నుంచి మరొక నగరానికి వెళ్లాలంటే వేలకు వేలు పెట్టాలి. అందే హెలికాప్టర్‌ అద్దెకు తీసుకోవాలంటే లక్షల రూపాయలు ఖర్చు చేయాలి. అందుకే ఓ యువకుడు సొంతంగా హెలికాప్టర్ తయారీ మొదలుపెట్టాడు. 8వ తరగతి వరకు చదువుకొని.. ఆ తర్వాత మానేసిన అతడు సొంతంగా హెలికాప్టర్ తయారు చేస్తున్నాడు. అది దాదాపుగా పూర్తయింది. ఐతే ట్రయల్ రన్ చేస్తున్న క్రమంలో అపశృతి చోటుచేసుకుంది. హెలికాప్టర్ బ్లేడ్ తలకు బలంగా తగిలి.. అక్కడికక్కడే అతడు మరణించాడు. మహారాష్ట్రలోని యావత్మల్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది.


స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం.. ఫుల్‌సావంగి ప్రాంతానికి చెందిన 29 ఏళ్ల షేక్ ఇస్మాయిల్ 8వ తరగతి వరకు చదువుకున్నాడు. కుటుంబ పరిస్థితులు బాగాలేక చదువు మానేసి పనిలో చేరాడు. వెల్డింగ్, ఫ్యాబ్రికేషన్ దుకాణం నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఐతే సొంతంగా హెలికాప్టర్ తయారు చేయాలన్నది ఇస్మాయిల్ కల. ఈరోజుల్లో హెలికాప్టర్ కొనాలంటే కోట్ల రూపాయలు ఖర్చు చేయాలని. కానీ తక్కవ ఖర్చుతో కేవలం రూ.30 లక్షల్లోనే హెలికాప్టర్‌ను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. అప్పుడే సామాన్యులకు విమానయాన భాగ్యం కలుగుతుందని అనుకున్నాడు. అలా 2019 నుంచి హెలికాప్టర్ తయారీ పనుల్లో నిమగ్నమయ్యాడు. ఉదయం తన డ్యూటీ చేసి.. రాత్రి వేళల్లో హెలికాప్టర్ తయారీ పనులు చేసుకునేవాడు.


గతంలో ఒకసారి బెంగళూరుకు వెళ్లాడు ఇస్మాయిల్. హెలికాప్టర్ తయారీ సంస్థల ప్రతినిధులను కలిసి హెలికాప్టర్ తయారీలో మెలకువలు నేర్చుకున్నాడు. ఆ తర్వాత మారుతి 800 కారు ఇంజిన్‌తో హెలికాప్టర్ తయారీని ప్రారంభించాడు. రోటార్, షాప్ట్, ల్యాండింగ్ స్కిడ్స్‌ను స్థానికంగా ఉండే ఓ పాత సామానుల దుకాణం నుంచి కొనుగోలు చేసి మార్పులు చేశాడు. మొత్తంగా రెండేళ్లు కష్టపడి హెలికాప్టర్ నిర్మాణాన్ని దాదాపుగా పూర్తిచేశాడు. దానికి మున్నా హెలికాప్టర్‌గా పేరుపెట్టాడు. ఆగస్టు 15న గ్రామస్తులందరికీ తన హెలికాప్టర్‌ను పరిచయం చేయాలని అనుకున్నాడు. ఈ క్రమంలోనే బుధవారం ఉదయం ట్రయల్ రన్ చేద్దామనుకొని హెలికాప్టర్‌ను స్టార్ట్ చేశాడు. తోక భాగంలో ఉండే రోటార్‌ ఒక్కసారిగా ఊడిపోయి.. బ్లేడ్‌లను బలంగా తాకింది. ఆ బ్లేడ్ ఇస్మాయిల్ తలను ఢీకొనడంతో.. అతడు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. అక్కడే ఉన్న స్నేహితులు అతడిని ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే అతడు మరణించాడు.


ఇస్మాయిల్ 8వ తరగతి వరకే చదువుకున్నప్పటికీ అతడు చాలా తెలివైన వాడని పో