top of page

కారు ఫ్యూయల్ గురించి అస్సలు నమ్మకూడని అపోహలు

వాహనాలకు వినియోగించే ఇంధనం గురించి డ్రైవర్లు చాలా అపోహలను నమ్ముతుంటారు. కొన్ని అపోహలు నిజమే అయినప్పటికీ, మరికొన్ని నమ్మడం వలన ఎలాంటి లాభం లేకపోవడమేకాక కారును డేంజర్‌లో పడేస్తాయి. వాహన ఇంధనం(వెహికల్ ఫ్యూయల్) గురించి ఎక్కువగా నమ్మే అపోహలు మరియు అలాంటి అపోహలను ఖచ్చితంగా నమ్మకూడదని తెలిపే కారణాలు ఇవాళ్టి కథనంలో మీ కోసం...


Fake Food in China - See 7 Fake Food Props in China in Telugu :- CLICK HERE

1. ఉదయం వేళ ఫ్యూయల్ నింపితే అధిక మైలేజ్ వస్తుందనుకోవడం ఉదయంపూట ఇంధనం నింపడానికి ప్రయత్నించడం మంచిదే. ఈ థియరీ రావడానికి అసలు కారణం. వేడి పెరిగేకొద్దీ పెట్రోల్ వ్యాకోచిస్తుంది. అదే ఉదయాన్నే పెట్రోల్ చల్లగా ఉంటుంది కాబట్టి వీలైనంత ఎక్కువ పెట్రోల్ నింపుకోవచ్చు దీంతో మైలేజ్ పెరుగుతుందనుకుంటారు.


నిజానికి ఫ్యూయల్ ట్యాంక్ వెహికల్ బాడీ క్రింద ఉంటుంది కాబట్టి, అప్పటికే ఇంజన్ ఆన్‌లో ఉంటుంది దీంతో ఫ్యూయల్ అప్పటికే వేడిని గ్రహిస్తుంది. దీంతో మనం ప్యూయల్ ఎప్పుడు పట్టించినా ట్యాంకులోకి వెళ్లిన పెట్రోల్ అంతే మొత్తంలో ఉంటుంది. కాబట్టి ఈ అపోహను నమ్మాల్సిన అవసరం ఎంత మాత్రమూ లేదు.


2. ఫ్యూయల్ తక్కువగా ఉన్నపుడు వాహనాన్ని నడపడం ఇంజన్‌కు మంచిది కాదనుకోవడం ఫ్యూయల్ ట్యాంకులో ఇంధనం తక్కువగా ఉన్నపుడు వాహనాన్ని నడిపితే, ట్యాంకు అడుగు భాగంలో మలినాలతో కూడిన ఇంధనం ఇంజన్‌కు చేరి, ఇంజన్‌ను పాడు చేస్తుందని, కాబట్టి ట్యాంకులో ఫ్యూయల్ లెవల్ ఎక్కుకవగా ఉంటే మంచి ఇంధన ఇంజన్‌కు చేరుతుంది కాబట్టి ఎలాంటి సమస్య ఉండదని చాలా మంది భావిస్తారు.


అస్సలు నమ్మకూడని అపోహలలో ఇది కూడా ఒకటి. ఎందుకంటే ప్రతి వెహికల్‍‌లోని ఫ్యూయల్ ట్యాంకులోని అడుగు భాగం నుండి ఇంధనాన్ని సరఫరా చేసే విధంగా రూపొందిస్తారు. కాబట్టి లో కెపాసిటి ఇంజన్ నడిపినా... ట్యాంక్ ఫుల్ చేయించి నడిపినా... ఇంజన్‌కు ఒరిగే నష్టమేమీ ఉండదు.


Weight Loss Tips :- ఈ పండ్లు బరువు తగ్గడంలో మీకు సహాయపడతాయి - CLICK HERE

3. నాన్ ప్రీమియమ్ కారుకు ప్రీమియమ్ ఫ్యూయల్ బెటర్ అనుకోవడం ఇది అక్షరాల తప్పు. పెట్రల్ బంకులకు వెళ్లినపుడు పవర్ మరియు ప్రీమియమ్ అనే పేర్లతో ఇంధనాన్ని మరియు వివిధ రకాల లుబ్రికేంట్స్ మరియు ఆయిల్ కలిపిన ఇంధనాన్ని విక్రయిస్తుంటారు. నిజానికి సాధారణ ఇంధనం మరియు రెగ్యులర్ ఇంధనానికి మధ్య పెద్ద వ్యత్యాసం ఏమీ ఉండదు.


నిజానికి ఇలా ప్రత్యేక పేర్లతో విక్రయించే ఫ్యూయల్స్ ధరలు అధికంగా ఉంటాయి. నాణ్యత పరంగా రెగ్యులర్ ఫ్యూయల్ మరియు ప్రీమియమ్ ఫ్యూయల్ ఒకేలా ఉంటాయి.


4. మైలేజ్ రీడింగ్స్ తప్పుగా వస్తున్నాయనుకోవడం మైలేజ్ రీడింగ్ వ్యవస్థ సరిగ్గా పనిచేయకపోతే మైలేజ్ రీడింగ్స్‌లో వ్యత్యాసం ఉండే అవకాశం ఉంది. కానీ, అన్నీ బాగా పనిచేస్తున్నప్పటికీ రీడింగ్స్ ప్రకారం, మీ వాహనం మిమ్మల్ని మోసం చేస్తోందని అనిపిస్తుంది. సాంకేతికంగా ఇందుకొక రీజన్ ఉంది.