New Smart Phone: ఇండియాలో లాంచ్ కానున్న కొత్త స్మార్ట్‌ఫోన్.. ధర, స్పెసిఫికేషన్ల వివరాలివే..
కరోనా వ్యాప్తి గణనీయంగా తగ్గడంతో ఆర్థిక కార్యకలాపాలు పుంజుకుంటున్నాయి. ఈ క్రమంలో మొబైల్ కంపెనీలు భారత్‌లో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేస్తున్నాయి. ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ మోటోరోలా సైతం వరుసగా సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లు, ట్యాబ్ లను భారత మార్కెట్లోకి విడుదల చేస్తోంది. తాజాగా మోటోరోలా మరొక కొత్త ఫోన్ తీసుకొస్తున్నట్లు ప్రకటించింది.

కరోనా(Corona) వ్యాప్తి గణనీయంగా తగ్గడంతో ఆర్థిక కార్యకలాపాలు పుంజుకుంటున్నాయి. ఈ క్రమంలో మొబైల్(Mobile) కంపెనీలు భారత్‌లో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేస్తున్నాయి. ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ మోటోరోలా సైతం వరుసగా సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లు, ట్యాబ్ లను భారత మార్కెట్లోకి విడుదల చేస్తోంది. తాజాగా మోటోరోలా మరొక కొత్త ఫోన్ తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. మోటో ఈ 40 (Moto e20) పేరుతో ఒక కొత్త బడ్జెట్ మొబైల్ ను అక్టోబర్ 12న అధికారికంగా లాంచ్ చేస్తున్నట్టు మోటరోలా ఇండియా (Motorola India) ట్విట్టర్ వేదికగా ప్రకటించింది.
ఇప్పటికే ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్ లో లిస్ట్ అయింది. అక్టోబర్ 12న మధ్యాహ్నం 12 గంటలకు మోటో ఈ40 లాంచ్ కానుందని ఫ్లిప్‌కార్ట్ వెబ్ సైట్ పేర్కొంది. 'పర్ఫెక్ట్ ఎంటర్‌టైనర్’ అనే ట్యాగ్‌లైన్‌తో రానున్న ఈ బడ్జెట్ ఫోన్ ధర రూ.10 వేల వరకు ఉండొచ్చని అంచనా. మోటోరోలా మోటో ఈ40 త్వరలోనే లాంచ్ కానున్న నేపథ్యంలో దాని స్పెసిఫికేషన్లు మొబైల్ ప్రియులను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ లో 720x1600 రిజల్యూషన్‌తో 6.5-అంగుళాల హెచ్ డీ+ ఐపీఎస్ ఎల్ సీడీ డిస్‌ప్లేని అందించారు. ఇది 90Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఇందులో 8 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా అందించారు. డిస్‌ప్లే టాప్-సెంటర్‌లో చిన్న హోల్-పంచ్ లో ఈ ఫ్రంట్ కెమెరా అమర్చారు.
ఈ ఫోన్‌కు ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఈ సెటప్ లో 2 మెగాపిక్సల్ డెప్త్ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెడికేటెడ్ మైక్రో విజన్ కెమెరా ఉంటాయి. f/1.7 ఎపర్చర్‌తో 48 మెగాపిక్సల్ కెమెరాని ప్రైమరీ కెమెరాగా అందించారు. మోటరోలా మోటో ఈ40 5000ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం కలిగి ఉంటుంది. ఇది 10వాట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఇది Unisoc T700 చిప్‌సెట్, అక్టా కోర్ 1.8 గిగాహెడ్జ్ చిప్ సెట్ పై నడుస్తుంది. ఈ ఫోన్ 4జీబీ ర్యామ్ + 64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ తో మార్కెట్లోకి విడుదల కానుంది.
మైక్రోఎస్డీ(SD) కార్డ్ ద్వారా స్మార్ట్‌ఫోన్ స్టోరేజ్ 512జీబీ వరకు పెంచుకోవచ్చు. ఇది నియర్ స్టాక్ ఆండ్రాయిడ్ 11 (Near-stock Android 11) గో ఎడిషన్ పై పనిచేస్తుంది. ఫిజికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్ లాక్ ఫీచర్ కూడా దీంట్లో ఉంటుంది. కార్బన్ గ్రే(Carbon Gray), పింక్ క్లే (Pink Clay) కలర్ ఆప్షన్లలో ఇది అందుబాటులోకి రానుంది. లీకైన స్పెక్స్ బట్టి చూస్తుంటే ఫోన్ భారతదేశంలో రూ. 10,000 లోపు ధరతో లాంచ్ అవుతుందని చెప్పవచ్చు.