Petrol Price Today: అక్కడ రూ.120కి చేరువలో లీటర్ పెట్రోల్.. దేశవ్యాప్తంగా తాజా ధరల వివరాలు
Petrol diesel Prices: జనాలు తన బైక్‌లు, కార్లను బయటకు తీయాలంటేనే వణికిపోతున్నారు. ఇంధన ధరలు అంతలా పెరుగుతున్నాయి. పెట్రోల్ రేటు 100ని తాకగానే వామ్మో.. అనుకున్నాం. కానీ ఇప్పుడు రూ.110 కూడా దాటి.. రూ.120 దిశగా పరుగులు పెడుతోంది. తాజాగా మరోసారి ఇంధన ధరలు పెరిగాయి. మరి ఎంత పెరిగాయి? ఏ నగరంలో ఎంత ఉన్నాయో ఇక్కడ చూద్దాం.

ఇంధన ధరల మోత కొనసాగుతోంది. ప్రజలు మండిపడుతున్నా.. ఇక చాలని గగ్గోలు పెడుతున్నా.. పెట్రోల్, డీజిల్ రేట్లు మాత్రం తగ్గడం లేదు. ఇవాళ మరోసారి పెరిగాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ 37 పైసలు, డీజిల్ 38 పైసలు పెరిగాయి. తాజా పెంపుతో హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.111.55కి చేరుకుంది. లీటర్ డీజిల్ ధర రూ.104.70గా ఉంది.
తెలంగాణలోని పలు నగరాల్లో ఇంధన ధరలు ఇలా ఉన్నాయి. వరంగల్‌లో లీటర్ పెట్రోల్ రూ.111.27గా ఉంది. డీజిల్ రూ.104.43కి చేరింది. నిజామాబాద్‌లో లీటర్ పెట్రోల్ రేటు 112.95 ఉండగా.. డీజిల్ ధర రూ.106.00కి లభిస్తోంది. కరీంనగర్‌లో లీటర్ పెట్రోల్ రూ.111.71, డీజిల్ రూ.104.85కి దొరుకుతోంది.
ఏపీలో ఇంధన ధరలు ఇలా ఉన్నాయి. గుంటూరులో లీటర్ పెట్రోల్ రూ.113.76, డీజిల్ రూ.106.23కి చేరింది. విశాఖపట్టణంలో లీటర్ పెట్రోల్ ధర రూ.111.96, డీజిల్ రేటు రూ.104.53గా ఉంది. కర్నూలులో లీటర్ పెట్రోల్ రూ.112.71, లీటర్ డీజిల్ రూ.105.28కి లభిస్తోంది.
ఇక దేశరాజధాని న్యూఢిల్లీలో లీటర్ పెట్రోల్ రేటు రూ.106.89, డీజిల్ రేటు రూ.95.62గా ఉన్నాయి. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.113.12కి చేరింది. డీజిల్ 104కి లభిస్తోంది.
>చెన్నైలో లీటర్ పెట్రోల్ రూ.104.22 డీజిల్ 100.25కి చేరింది. బెంగళూరులో లీటర్ పెట్రోల్ రేటు రూ.110.61కి చేరగా, డీజిల్ ధర 101.49ను తాకింది. కోల‌్‌కతాలో లీటర్ పెట్రోల్ రూ.107.78, డీజిల్ రూ.99.08గా ఉంది.
మన దేశంలో పెట్రోల్ రేటు అత్యధికంగా రాజస్థాన్‌లోని గంగానగర్‌లో ఉంది. అక్కడ లీటర్ పెట్రోల్ రేటు రూ.119.66గా ఉంది. నిన్నటిలో పోల్చితే ఇవాళ ఏకంగా 1.12 రూపాయలు పెరగడం విశేషం. డీజిల్ కూడా 1.06 పెరిగింది. ప్రస్తుతం లీటర్ డీజిల్ ధర రూ.110.47గా ఉంది. పెట్రోల్ రేటు రేపు 120ని తాకే అవకాశముంది.
ధరల పెరుగుదల ఇలాగే కొనసాగితే.. మరో 15 రోజుల్లో హైదరాబాద్‌లో కూడా లీటర్ పెట్రోల్ ధర రూ.120, డీజిల్ ధర రూ.110 చేరుకునే సూచనలు కనిపిస్తున్నాయి.