Railway Jobs 2021: దక్షిణ మధ్య రైల్వేలో 4,103 ఉద్యోగాలు - Apply Like This
South Central Railway Recruitment 2021 | దక్షిణ మధ్య రైల్వే 4,000 పైగా ఉద్యోగాల (Railway Jobs) భర్తీకి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించింది. ఈ జాబ్ నోటిఫికేషన్ (Job Notification) వివరాలు తెలుసుకోండి.

భారతీయ రైల్వేలో ఉద్యోగాలు (Railway Jobs) కోరుకునేవారికి శుభవార్త. సికింద్రాబాద్ కేంద్రంగా ఉన్న దక్షిణ మధ్య రైల్వే భారీగా ఉద్యోగాల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. అప్రెంటీస్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 4,103 పోస్టుల్ని ప్రకటించింది. కార్పెంటర్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, మెషినిస్ట్, పెయింటర్ లాంటి పోస్టులున్నాయి. సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ పాస్ అయిన అభ్యర్థులు దరఖాస్తు చేయొచ్చు. ఈ పోస్టులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2021 నవంబర్ 3 చివరి తేదీ. ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసేముందు జాబ్ నోటిఫికేషన్‌లో విద్యార్హతల వివరాలు తెలుసుకోవాలి. మరి ఈ జాబ్ నోటిఫికేషన్‌తో పాటు దరఖాస్తు విధానం గురించి తెలుసుకోండి.
South Central Railway Recruitment 2021: ఖాళీల వివరాలు ఇవే...
మొత్తం ఖాళీలు | 4,103 | విద్యార్హతలు |
ఏసీ మెకానిక్ | 250 | టెన్త్ 50 శాతం మార్కులతో పాస్ కావడంతో పాటు మెకానిక్ (R & AC) ట్రేడ్‌లో ఐటీఐ పాస్ కావాలి. |
కార్పెంటర్ | 18 | టెన్త్ 50 శాతం మార్కులతో పాస్ కావడంతో పాటు కార్పెంటర్ ట్రేడ్‌లో ఐటీఐ పాస్ కావాలి. |
డీజిల్ మెకానిక్ |