Republic 1st weekend days collections: సాయి ధరమ్ తేజ్ ‘రిపబ్లిక్’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్.. ఇంక కష్
Republic 1st weekend days collections: సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) హీరోగా దేవా కట్టా తెరకెక్కించిన రిపబ్లిక్ సినిమా (Republic 1st weekend days collections) అక్టోబర్ 1న విడుదలైంది. సినిమా ఎంత బాగున్నా కూడా చివర్లో హీరో చచ్చిపోవడంతో.. ఏంట్రా బాబూ ఇది అంటూ పెదవి విరిచారు ప్రేక్షకులు.

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా దేవా కట్టా తెరకెక్కించిన రిపబ్లిక్ సినిమా అక్టోబర్ 1న విడుదలైంది. తొలిరోజు దీనికి పాజిటివ్ టాక్ వచ్చింది. సినిమా బాగుంది కానీ చివర్లో హీరో చచ్చిపోతాడు.. చూడాలిక ఎంతవరకు ఆడుతుందో అంటూ క్రిటిక్స్ కూడా ఈ సినిమాకు అటూ ఇటూ కాని రివ్యూస్ ఇచ్చారు. ఇప్పుడు వసూళ్లు కూడా అలాగే వస్తున్నాయి. సాయి ధరమ్ తేజ్ గత సినిమాలతో పోలిస్తే రిపబ్లిక్ సినిమాకు చాలా తక్కువ వసూళ్ళు వచ్చాయి. ఇంకా చెప్పాలంటే గతంలో సాయి సినిమాకు తొలిరోజు వచ్చే కలెక్షన్స్.. ఇప్పుడు రిపబ్లిక్ సినిమా తీసుకురావడానికి మూడు రోజులు పట్టింది. సినిమా ఎంత బాగున్నా కూడా చివర్లో హీరో చచ్చిపోవడంతో.. ఏంట్రా బాబూ ఇది అంటూ పెదవి విరిచారు ప్రేక్షకులు. అందుకే సినిమాను ఎంతో అద్భుతంగా తెరకెక్కించినా కూడా నెగిటివ్ క్లైమాక్స్ వసూళ్ళపై దారుణమైన ప్రభావం చూపించింది. ఈ సినిమా ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ఓసారి చూద్దాం..
నైజాం: 1.39 కోట్లు
సీడెడ్: 0.87 కోట్లు
ఉత్తరాంధ్ర: 0.61 కోట్లు
ఈస్ట్: 0.33 కోట్లు
వెస్ట్: 0.32 కోట్లు
గుంటూరు: 0.37 కోట్లు
కృష్ణా: 0.32 కోట్లు
నెల్లూరు: 0.24 కోట్లు
ఏపీ + తెలంగాణ: 4.45 కోట్లు షేర్
రెస్ట్ ఆఫ్ ఇండియా + కర్ణాటక: 0.24 కోట్లు
ఓవర్సీస్: 038 కోట్లు
వరల్డ్ వైడ్ కలెక్షన్స్: 5.07 కోట్లు షేర్
రిపబ్లిక్ సినిమాకు ప్రస్తుతం ఉన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని రూ.12 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసారు. సాయి రేంజ్‌కు ఇది తక్కువే కానీ సినిమాకు టాక్ తేడాగా ఉండటంతో కలెక్షన్స్ తక్కువగా వస్తున్నాయి. ఇప్పటి వరకు కేవలం 5 కోట్లు మాత్రమే వసూలు చేసింది ఈ చిత్రం.