SBI Scholarship : SBI స్కాలర్‌షిప్‌లు రూ. 38,500 విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయి.
కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన వారి చదువు, భవిష్యత్తు ప్రశ్నార్థకమైంది. అటువంటి పిల్లలకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (State Bank Of India) SBI జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ ద్వారా వారికి చేయూత నందించేందుకు స్కాలర్‌షిప్ ప్రొగ్రాంను అందిస్తున్నారు.

కరోనా మహమ్మారి (Covid-19 pandemic)కారణంగా వేలాది మంది పిల్లలు నిరాశ్రయులయ్యారు. తల్లిదండ్రులను కోల్పోయిన వారి చదువు, భవిష్యత్తు ప్రశ్నార్థకమైంది. అటువంటి పిల్లలకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (State Bank Of India) SBI జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ ద్వారా వారికి చేయూత నందించేందుకు స్కాలర్‌షిప్ ప్రొగ్రాంను అందిస్తున్నారు. ఆ కార్యక్రమం పేరు SBI జనరల్ సురక్ష సపోర్ట్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్. కరోనా కారణంగా తల్లి లేదా తండ్రిని కోల్పోయిన వారు. జీవనోపాధి కోల్పోయిన కుటుంబ విద్యార్థులకు ఈ స్కాలర్‌షిప్‌ను అందించనున్నారు. ఈ స్కాలర్‌షిప్ (Scholarship) కు ఎంపికైన వారికి విభాగాల వారీగా రూ.29,500 నుంచి రూ.38,500 వరకు రివార్డు అందించనున్నారు. ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకొనే విధానం అర్హతలు తెలుసుకోండి.
ముఖ్య సమాచారం..
స్కాలర్‌షిప్ పేరు | SBI జనరల్ సురక్ష సపోర్ట్ స్కాలర్‌షిప్ |
స్కాలర్‌షిప్ అందించే వారు | SBI జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ |
అర్హత | కోవిడ్ కారణంగా ప్రభావితమైన 9 నుంచి 12 తరగతి, గ్రాడ్యుయేషన్ చదువుతున్న విద్యార్థులు. |
స్కాలర్‌షిప్ వివరాలు.. | - 9 నుంచి 12 తరగతి చదువుతున్న వారికి రూ.29,500- గ్రాడ్యుయేషన్ చేస్తున్న వారికి రూ.38,500 |
దరఖాస్తుకు చివరి తేదీ |