top of page

Talibans: తాలిబన్ల బలం ఏమిటి ? వాళ్లకు వేల కోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి ?.. పూర్తి వివరాలు

Updated: Aug 17, 2021


ఆఫ్ఘన్‌లోని ఖనిజ నిక్షేపాలైన ఇనుము, మార్బుల్‌, రాగి, జింక్‌తోపాటు ఇతర అరుదైన లోహాలు ఉండటం తాలిబన్లకు వరంలా మారింది.

రెండు దశాబ్దాల తరువాత మళ్లీ తాలిబన్లు ఆఫ్ఘనిస్థాన్‌ను తమ హస్తగతం చేసుకున్నారు. అమెరికా తమ సేనలను వెనక్కి రప్పించే ప్రక్రియ మొదలుపెట్టడంతో తాలిబన్ల పని సులువైంది. అయితే ఉగ్రవాద సంస్థ అయిన తాలిబన్ గ్రూప్ ఓ దేశాన్ని కబళించేంత బలంగా ఉండటానికి అనేక కారణాలు ఉన్నాయి.




ప్రపంచంలో పది అత్యధిక సంపద గల ఉగ్రవాద సంస్థల్లో తాలిబన్లు ఐదో స్థానంలో నిలిచారు. ఏడాదికి రెండు బిలియన్ డాలర్ల ఆదాయంతో ఐసిస్‌ తొలి స్థానంలో ఉంది. నాలుగు మిలియన్ డాలర్లతో తాలిబన్లు ఐదో స్థానంలో ఉన్నారు.


వీరికి ప్రధానంగా మాదకద్రవ్యాల అక్రమ రవాణా, కిడ్నాప్‌లు, సానుభూతిపరుల నుంచి నిధులు, విరాళాలే వస్తాయని ఫోర్బ్స్‌ పేర్కొంది. 2019-20లో తాలిబన్ల బడ్జెట్‌ 1.6 బిలియన్ డాలర్లు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం.




అక్రమ గనుల ద్వారా 464 మిలియన్ డాలర్లు, మాదకద్రవ్యాల రవాణా ద్వారా 416 మిలియన్ డాలర్లు, విదేశీ విరాళాల ద్వారా 240 మిలియన్ డాలర్లు, ఎగుమతుల ద్వారా 240 మిలియన్‌ డాలర్లు, పన్నుల ద్వారా 160 మిలియన్ డాలర్లు, రియల్‌ ఎస్టేట్‌ ద్వారా 80 మిలియన్‌ డాలర్లు తాలిబన్లకు వచ్చినట్టు సమాచారం.