Telangana: తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఆ నిబంధనలు తొలగింపు..!

గతంలో పలు ప్రవేశ పరీక్షలకు కనీస మార్కులు సాధించాల్సి ఉంటుందన్న నిబంధనలను విద్యాశాఖ అధికారులు సడలించారు. అయితే తమకు కూడా ఆ నిబంధన వర్తింపజేయాలని పలువురు విద్యార్థులు కోర్టును ఆశ్రయించారు.
ఇంటర్మీడియట్‌లో పాసైన విద్యార్థులందరూ రాష్ట్రంలోని వివిధ కోర్సుల్లో ప్రవేశాలు పొందేందుకు అర్హులేనని ప్రభుత్వం నిర్ణయించింది. కరోనా నేపథ్యంలో ఆయా కోర్సుల్లో చేరేందుకు ఉన్న కనీస మార్కుల నిబంధనను తొలగించింది.
దీంతో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ సహా వివిధ కోర్సుల్లో ప్రవేశాలు పొందేందుకు లైన్ క్లియర్ అయ్యింది. విద్యాశాఖ కార్యదర్శి సందీప్ సుల్తానియా ఈ మేరకు వివిధ విద్యాశాఖల అధికారులతో సమావేశమయ్యారు.
గతంలో పలు ప్రవేశ పరీక్షలకు కనీస మార్కులు సాధించాల్సి ఉంటుందన్న నిబంధనలను విద్యాశాఖ అధికారులు సడలించారు. అయితే తమకు కూడా ఆ నిబంధన వర్తింపజేయాలని పలువురు విద్యార్థులు కోర్టును ఆశ్రయించారు.
దీంతో ప్రస్తుత విద్యాసంవత్సరంలో అన్ని ప్రవేశ పరీక్షలకూ కనీస మార్కుల నిబంధనను ఎత్తేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన త్వరలోనే ఉత్తర్వులు జారీ చేయనున్నట్టు సమాచారం.
ఈ నిర్ణయం ద్వారా ఇంటర్‌లో 35శాతం కనీసం మార్కులతో పాసైన విద్యార్థులు సైతం ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ, లా సహా పలు కోర్సుల్లో ప్రవేశాలు పొందేందుకు అర్హులు అవుతారు.