top of page

Antioxidant Vegetables: ఈ 7 రకాల కూరగాయల వల్ల ఎన్నో లాభాలు.. కచ్చితంగా రోజూ తినేలా చూసుకోండి

కూరగాయల విషయంలో ప్రజలు అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉన్న కూరగాయల వైపు మొగ్గుచూపుతున్నారు. సమతుల్యమైన బరువు, గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడం, చురుకైన మెదడు కోసం యాంటీ ఆక్సిడెంట్లు బాగా పనిచేస్తాయి.



కరోనా మహమ్మారి కారణంగా ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన పెరిగింది. ముఖ్యంగా కూరగాయల విషయంలో ప్రజలు అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉన్న కూరగాయల వైపు సమతుల్యమైన బరువు, గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడం, చురుకైన మెదడు కోసం యాంటీ ఆక్సిడెంట్లు బాగా పనిచేస్తాయి. ఇవి శరీరంలోని ప్రీరాడికల్స్‌ని తొలగించి తీవ్రమైన అనారోగ్యాలను నివారిస్తాయి. కాబట్టి ఆరోగ్యం, శ్రేయస్సు కోసం మీ రోజువారీ మెనూలో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండేలా చూసుకోవాలని డాక్టర్లు చెబుతున్నారు. యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే 7 కూరగాయలను పరిశీలిద్దాం.



కిడ్నీ బీన్స్‌

కిడ్నీ బీన్స్​ను రాజ్మా అని పిలుస్తారు. ఇందులో ప్రోటీన్‌లు, యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా లభిస్తాయి. అవి రక్తంలో చక్కెరను నియంత్రించడం, కొలెస్ట్రాల్‌ను తగ్గించడం, రోగనిరోధక శక్తిని పెంచడంలో ఉపయోగపడతాయి. సుగంధ ద్రవ్యాలు, టమోటాలు, ఉల్లిపాయలలో రాజ్మాను ఉడికించి, తీసుకోవచ్చు. అద్భుతమైన టేస్ట్​తో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి.



బ్రకోలీ