top of page

ఈ పండ్లు బరువు తగ్గడంలో మీకు సహాయపడతాయి.

మారుతున్న జీవనశైలి కారణంగా వయసుతో సంబంధం లేకుండా చాలా మందిని అధిక బరువు సమస్య వేధిస్తోంది. దీంతో అధిక శాతం మంది డైటింగ్, వ్యాయామాలు, జిమ్ని ఆశ్రయిస్తున్నారు. అయితే డైటింగ్ చేస్తున్న సమయంలో అనేక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. లేదంటే బరువు తగ్గడం అటుంచితే.. ఇతర అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.

డైటింగ్ చేస్తున్నప్పుడు ఎక్కువగా పండ్లు, సలాడ్లు, పీచుపదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. ఇవి మీ ఆకలి నియంత్రిస్తాయి. పండ్లలో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ అధికంగా లభిస్తాయి. ఇవి బరువు తగ్గించే లక్ష్యాలను సాధించడానికి ఎంతో సహకరిస్తాయి. తీపి పదార్థాలు తినాలనే కోరికలు మీ బరువు తగ్గించే ప్రయాణానికి ఆటంకం కలిగిస్తాయి. ముఖ్యంగా పండుగ సీజన్‌లో. అటువంటి సమయంలో పండ్లు తింటే ఎంతో ఫలితం దక్కుతుంది. ఎందుకంటే అవి ఆరోగ్యకరమైనవి, రుచికరమైనవి మాత్రమే కాకుండా మీ బరువు తగ్గించే ప్రయత్నాలకు మద్దతునిచ్చే గొప్ప మార్గం. మీరు రోజూ డైటింగ్ చేస్తున్నట్లయితే ఈ పండ్లను మీ డైట్‌లో చేర్చుకోండి.

అరటి పండు:

అరటి పండులో 23 శాతం కార్బోహైడ్రేట్లు, 1 శాతం ప్రొటీన్‌లు, 2.6 శాతం ఫైబర్ ఉంటుంది. అంతేకాకుండా అరటిపండులో పొటాషియం కూడా లభిస్తుంది. అరటి పండు సులభంగా జీర్ణమై, మలబద్ధకం రాకుండా శరీరాన్ని కాపాడుతుంది. అరటిపండు ఆకలిని తగ్గిస్తుంది. వ్యాయామానికి గంట ముందు అరటిపండుపై టేబుల్ స్పూన్ వేరుశనగ వెన్నను పూసి తింటే గొప్ప ఫలితం లభిస్తుంది. అందుకే వ్యాయామానికి ముందు అరటిపండును గొప్ప చిరుతిండిగా అభివర్ణించవచ్చు. వ్యాయామం చేసిన వారి శరీరంలో అలసిన కండరాలను అరటిపండు తిరిగి ఉత్తేజపరుస్తుంది. అలాగే కండరాల తిమ్మిర్లు తగ్గుతాయి. అరటిపండు ఇన్సులిన్ ఉత్తత్తికి ఎంతగానో తోడ్పడుతుంది. గుండె జబ్బులు రాకుండా అరటి పండును శరీరాన్ని కాపాడుతుంది. గుండెలో ఉండే నరాల ఒత్తిడిని తగ్గించి మాములు స్థాయికి తీసుకువస్తుంది.

జామపండు:

జామపండు బరువు తగ్గడానికి అనువైన పండు. జామపండులో ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, పొటాషియం, ఫైబర్ ఉంటుంది. జామపండు తినడం వల్ల ఎక్కువకాలం జీవించవచ్చు. ఎందుకంటే ఇవి మీ జీవక్రియను నియంత్రిస్తాయి. మీ రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యం చేస్తాయి. డయాబెటిస్ ఉన్నవారికి, బరువు తగ్గాలని భావించే వారికి జామపండు ఒక మంచి ఎంపిక. జామ పండ్లలో కొన్ని తెల్లగా ఉంటాయి. కొన్ని ఎర్రగా ఉంటాయి. ఒక జామపండు 10 ఆయిల్స్‌కి సమానం అందుకే దీనికి పేదవాడి అపిల్ అని పేరువచ్చింది. ఒకప్పుడు సీజన్‌లో మాత్రమే జామపండ్లు లభించేవి..కానీ ఇప్పుడు 365 రోజులు జామ పం