top of page

TTD special darshan tickets: శ్రీవారి రూ.300 దర్శనం టిక్కెట్ల బుకింగ్‌... ఇక కొత్త ఏడాది వరకు..!

TTD special darshan tickets: తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయంలో భక్తుల కోసం ప్రత్యేక దర్శనం రూ.300 టిక్కెట్లు 2021 డిసెంబర్‌ 31 వరకు విక్రయించేశారు. ఇక ప్రత్యేక దర్శనం టోకెన్ల జారీ 2022లోనే ప్రారంభమవ్వనుంది.

TTD special darshan tickets: కరోనా తగ్గుముఖం పట్టడంతో తిరుమలకు వెళ్లే భక్తుల సంఖ్య పెరుగుతోంది. నిబంధనలు సడలింపులను ప్రకటించిన గత నెల నుంచి ఉచిత దర్శనం కోసం టిక్కెట్లు జారీ చేస్తున్నారు.


అదేవిధంగా రోజుకు రూ.300 దర్శనానికి 12 వేల మందిని మాత్రమే అనుమతి ఉంది. టోకెన్‌ ఆన్‌లైన్‌ (online)లో జారీ చేశారు. ఈరోజు ఉచిత దర్శనం టిక్కెట్లు (free darshan tokens) జారీ చేయనున్నారు.


ఇక ఆన్‌లైన్‌ బుకింగ్‌ (online booking) ప్రారంభమైన కొన్ని గంటల్లోనే టిక్కెట్ల విక్రయం ముగిసింది. 300 రూపాయల దర్శన టికెట్లను .. 45 నిమిషాల్లోనే 3.35 లక్షల టికెట్ల విక్రయాలు పూర్తయ్యాయి. నవంబర్ నెలకు సంబంధించి రోజుకు 10 వేల చొప్పున టికెట్లను విడుదల చేయాలని టీటీడీ నిర్ణయించింది. అక్టోబర్ 25న నవంబర్ నెలకు సంబంధించి వసతి గదుల కోటా విడుదల చేయాలని టీటీడీ భావిస్తోంది. ఉచిత టోకెన్లు త్వరగా అమ్ముడవుతున్న నేపథ్యంలో భక్తులు ఉదయాన్నే బుకింగ్‌ చేసుకోవడం మంచిది. ఈ బుకింగ్‌ ఉదయం 9 గంటలకు ప్రారంభవుతుంది.


అక్టోబర్‌ టికెట్లు ఇప్పటికే అమ్ముడయ్యాయి. నవంబర్, డిసెంబర్‌ నెల మొత్తం రూ.300 టిక్కెట్లు విక్రయించేశారు. గతంలో టికెట్లు బుక్ చేసుకునే సమయంలో భక్తులకు సర్వర్ సమస్యలు తలెత్తేవి. ఈసారి మాత్రం ఎటువంటి సర్వర్ ఇబ్బందులు లేకుండానే సాఫీగా టికెట్ల విక్రయాలు సాగాయి. ఈ విధంగా ప్రత్యేక చెల్లింపు దర్శనం టిక్కెట్లను 2022లో మాత్రమే విక్రయించనున్నారు.భక్తులు వెబ్‌సైట్‌ ద్వారా రోజుకు 8 వేల మంది ఉచిత దర్శనం టోకెన్లను బుక్‌ చేసుకోవచ్చు.


ఇక ప్రత్యేక దర్శనం టోకెన్ల జారీ 2022లోనే ప్రారంభమవ్వనుంది.భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అధికారులు కొన్ని సూచనలు చేశారు. శ్రీవారి దర్శన టికెట్లు (Tickets) ఉన్న భ‌క్తుల‌ను మాత్ర‌మే తిరుమల (Tirumala)కు అనుమతిని ఇస్తున్నామని అధికారులు చెప్పారు. కరోనా నేపథ్యంలో భక్తులు, ఉద్యోగుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని వ్యాక్సినేష‌న్ సర్టిఫికేట్ (Vaccination Certificate) కానీ, దర్శనానికి 72 గంటల ముందు చేసుకున్న ఆర్‌టీపీసీఆర్ పరీక్ష నెగిటివ్ సర్టిఫికేట్ (RTPCR Negative certificate) కానీ త‌ప్ప‌నిస‌రిగా తీసుకురావాల‌ని తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) విజ్ఞ‌ప్తి చేసింది. ప‌లువురు భ‌క్తులు ద‌ర్శ‌న టికెట్లు లేకుండా స్వామివారి ద‌ర్శ‌నం కోసం వ‌స్తుండ‌టంతో అలిపిరి చెక్ పాయింట్ వ‌ద్ద సిబ్బంది త‌నిఖీ (Checking) చేసి వెన‌క్కు పంపుతున్నారు. అందుకే భ‌క్తులు (devotes) ఈ విష‌యాల‌ను గ‌మ‌నించి టీటీడీకి స‌హ‌క‌రించాల‌ని కోరింది.


https://tirupatibalaji.ap.gov.in/#/login</