top of page

ఇంట్లో చీపురును ఎక్కడ పెట్టాలో తెలుసా? నిర్లక్ష్యం చేస్తే డబ్బులు పోతాయట

మనలో చాలా మంది వాస్తు శాస్త్రాన్ని నమ్ముతారు. ఇంట్లో ఎక్కడ ఉండాల్సిన వస్తువు అక్కడే ఉండాలి. లేదంటే సమస్యలు వస్తాయని నమ్ముతుంటారు. చీపురు విషయంలోనూ ఇది వర్తిస్తుంది. చెత్తను ఊడ్చే చీపురకు ఎందుకు అంత ప్రాధాన్యత అని అనుకోవద్దు. నిర్లక్ష్యంగా ఉంటే అదే చీపును మీ ఇంట్లోని డబ్బును కూడా ఊడ్చేస్తుందని వాస్త్రశాస్త్ర నిపుణులు చెబుతున్నారు.


Use చాలా మంది చీపురును ఇంటి ప్రధాన ద్వారం పక్కన ఉండే మూలలోనో.. లేదంటే గుమ్మం పక్కనో పెడుతుంటారు. అలా చేయకూడదు. ఇంట్లో చీపురును ఎవరికీ కనిపించని ప్రాంతంలోనే పెట్టాలని వాస్తు శాస్త్రం చెబుతోంది.


ముఖ్యంగా ఇంటికి ఎవరైనా గెస్ట్‌లు వచ్చినప్పుడు వాళ్ల కాళ్లకు తగిలేలా చీపురును ఉంచకూడదు. మీరు కూడా కాలితో తన్నకూడదు. చీపురును కాలితో తన్నితే లక్ష్మీ దేవి ఆగ్రహిస్తుంట. అలాంటి ఇంట్లో డబ్బులు నిలవదని నిపుణుల మాట.


ఇంట్లో విలువైన వస్తువులు ఉంచే కప్‌బోర్డ్స్, డబ్బులు దాచే బీరువా పక్కన చీపురును ఉంచకూడదు. అలా చేస్తే డబ్బులు త్వరగా పోతాయట.


చీపురును ఎప్పుడూ తిరగేసి ఉంచూడదు. హ్యాండిల్ పైవైపు, ఊడ్చే చీపురు పిల్లల కొనలు కింద వైపు ఉండేలా చూసుకోవాలి. చీపురును తిరగేసి ఉంచితే ఆ ఇంట్లో ధనం నిలవదట.


ఇంట్లో ఈశాన్య ప్రాంతంలో చీపురును ఉంచడం మంచి పద్దతి. ఇంటి పైకప్పు పైన చీపురును ఉంచకూడదు. అలా ఉంచితే దొంగతనాల రూపంలో మీ డబ్బు దూరమవుతుదని నిపుణులు చెబుతున్నారు.


చీపురును వంటింట్లో, డైనింగ్ రూమ్‌లో అస్సలు ఉంచకూడదు. వంటింట్లో చీపురు ఉంటే మీ తిండి గింజలు తరిగిపోతాయట. కుటుంబ సభ్యులు అనారోగ్యానికి గురవుతారట.


రాత్రి వేళల్లో చీపురును ఇంటి బయట ఉంచాలి. మీ ప్రధాన ద్వార ముందు నేలపై ఉంచాలి. నిలబెట్టకూడదు. గుమ్మానికి అడ్డంగా వేయాలి. అలా చేస్తే దుష్ట శక్తులు మీ ఇంట్లోకి రాకుండా చీపురు అడ్డుకుంటుందట. అందుకే ఇంట్లో సరైన ప్రాంతంలోనే చీపురును పెట్టాలని నిపుణులు చెబుతున్నారు.


(Disclaimer: The information and information provided in this article are based on general information. Sasarey Media does not confirm these. Please contact the relevant expert before implementing them.)